ford: ప్లీజ్.. ఫోర్డ్ మమ్మల్ని వదిలి వెళ్లకు..

by Anukaran |   ( Updated:2021-09-10 04:07:41.0  )
ford: ప్లీజ్.. ఫోర్డ్ మమ్మల్ని వదిలి వెళ్లకు..
X

దిశ, వెబ్‌డెస్క్: భారత్ లో వ్యాపారం చేయాలంటే ఒక భారతీయుడులానే ఆలోచించాలి. అలా ఆలోచించకపోతే ఆ వ్యాపారం మూడునాళ్ల ముచ్చటే అవుతోంది. తాజాగా ఆటోమొబైల్‌ దిగ్గజం ఫోర్డ్‌ సంస్థ వ్యాపారం కూడా అలాగే అయ్యింది. ఫోర్డ్‌ వ్యాపారం గత పదేళ్లుగా ఆశాజనకంగా లేదు. ఈ కాలంలో 2 బిలియన్‌ డాలర్ల నష్టం వచ్చింది. మరో 800 మిలియన్‌ డాలర్ల నిరర్ధక ఆస్తులను పక్కనపెట్టాల్సి వచ్చింది. దీనికి కొవిడ్‌ సెగ కూడా తోడవడంతో ఫోర్డ్ సంస్థ ఇండియాలో తమ ఆపరేషన్స్‌ నిలిపేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించింది. గత ఐదేళ్లలో ఫోర్డుతో కలిపి ఆరు కంపెనీలు భారత్‌ను వీడాయి. వీటిల్లో జనరల్‌ మోటార్స్‌, ఫోర్డ్‌, హార్లీడెవిడ్‌సన్‌,యూఎం మోటార్‌ సైకిల్స్‌ కూడా అమెరికావే కావడం గమనార్హం.

ఇక ఫోర్డ్ ఇండియాను వీడడం భారతీయులను కలిచివేసింది. సెప్టెంబరు 9న ఫోర్డ్‌ నుంచి ప్రకటన వెలువడినప్పటి నుంచి ఫోర్డ్‌ ఇండియా హ్యాష్‌ట్యాగ్‌ ట్రెండవుతోంది. అధికారిక ప్రకటన వచ్చిన దగ్గరనుంచి ప్లీజ్.. ఫోర్డ్ మమ్మల్ని వదిలి వెళ్లకు అంటూ ట్విట్టర్ లో అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక వీటిపై స్పందించిన ఫోర్డ్ సంస్థ.. ఇండియాను వదిలి ఎక్కడికి వెళ్లడం లేదని, కేవలం లైట్‌ బిజినెస్‌ మోడల్‌ని అప్లై చేయబోతున్నట్టు తెలిపింది. దీని వల్ల లాంగ్‌ రన్‌లో సంస్థకు లాభాలు వస్తాయంటూ వివరణ ఇచ్చింది. ఇక దీంతో ఫోర్డ్ అభిమానులు కాస్త నెమ్మదించారు. ఫోర్డ్ కొనాలని ఎన్నోరోజులుగా కలలు కంటూ డబ్బులు కూడబెడుతున్నా.. ఇప్పుడు ఫోర్డ్ ఈ కఠిన నిర్ణయం తీసుకోవడం చాలా బాధగా ఉందని మెయినుద్దీన్‌ షేక్‌ అనే వ్యక్తి ట్వీట్ చేశాడు. మరికొందరు మిస్ యూ ఫోర్డ్ అని ట్వీట్స్ చేస్తున్నారు.

https://twitter.com/1998_Siddharth_/status/1435913133478928388?s=20

Advertisement

Next Story