- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ తిమింగలాలు రోజుకు ఎంత ఆహారం తింటాయో తెలుసా…?
దిశ, ఫీచర్స్: భూమిపై నివసించే జీవుల్లో బలీన్ తిమంగలాలు అతిపెద్దవి. 3500 కేజీల బరువుండే ‘పిగ్మీ రైట్’ తిమింగలాల నుంచి 1,90,000 కేజీలుండే బ్లూ వేల్స్ వరకు బలీన్స్‌లో అనేక జాతులున్నాయి. శరీర బరువే ఈ జంతువుల మనుగడకు కీలకం కాగా.. తమ శక్తిని ఉపయోగించేందుకు, అవసరమైన ఆహారాన్ని అన్వేషించేందుకు ఈ బరువే దోహదం చేస్తుంది. అయితే ఈ బలీన్ తిమింగలాలు గతంలో అనుకున్నదానికంటే మూడురెట్లు లేదా అంతకంటే ఎక్కువ మొత్తంలో ఆహారం తీసుకుంటాయని కొత్త అధ్యయనంలో వెల్లడైంది. నేచర్ జర్నల్‌లో ఇందుకు సంబంధించిన అధ్యయనం ప్రచురితమైంది.
పరిశోధకులు 2010 – 2019 వరకు అట్లాంటిక్, పసిఫిక్, దక్షిణ మహాసముద్రాల్లో 321 తిమింగలాలను ట్రాక్ చేశారు. ఈ మేరకు ‘హంప్‌బ్యాక్, ఫిన్, బ్లూ, మింకే, రైట్, బోహెడ్, బ్రైడ్ వేల్’ వంటి ఏడు బలీన్ వేల్ జాతుల రోజువారీ ఆహారాన్ని లెక్కించారు. ఈ అతిపెద్ద సముద్ర క్షీరదాలు మునుపటి అంచనాల కంటే మూడు రెట్లు ఎక్కువ ఆహారం తింటున్నట్లు కనుగొన్నారు. తిమింగలం నోటి పరిమాణాన్ని అంచనా వేయడానికి డ్రోన్స్ యూజ్ చేసిన రీసెర్చర్స్.. వాటి కదిలికల ట్రాకింగ్ కోసం సెన్సార్లను ట్యాగ్ చేశారు. ఆహారం కేంద్రీకృతమై ఉన్న ప్రదేశాలను గుర్తించేందుకు సౌండ్ మెథడ్ ఉపయోగించారు.
కెమెరా, మైక్రోఫోన్, GPS లొకేటర్ సాయంతో అవి తరచుగా ఎంత తింటున్నాయో గమనించారు. తిమింగలం కదలికలను, అవి తినే ఆహారాన్ని మునుపటి అధ్యయనాలతో పాటు చనిపోయిన తిమింగలాల కడుపును పరిశీలించడం లేదా బలీన్ తిమింగలాల జీవక్రియ రేట్ల ఆధారంగా గణిత నమూనాలను ఉపయోగించి లెక్కించారు. కానీ వాస్తవ అంశాల్ని గుర్తించలేకపోయారు. అయితే కొత్త అధ్యయనంలో బలీన్ తిమింగలాలు రోజుకు 16 టన్నుల ఆహారాన్ని తినగలవని వెల్లడైంది. ఇది వాటి మొత్తం శరీర ద్రవ్యరాశిలో 30% వరకు ఉంటుంది. ఇక నీలి తిమింగలాలు అతిపెద్ద డైనోసార్ల కంటే పెద్దవిగా ఉంటాయి. ఇవి 110 అడుగుల (33 మీటర్లు) పొడవు, 200 టన్నుల బరువుంటాయి.
కాగా బలీన్ తిమింగలాలు ఏడాది 100 రోజులు మాత్రమే తింటాయి. ఇక నీలి తిమింగలం రోజుకు 16 టన్నుల చొప్పున సంవత్సరానికి 1,600 టన్నుల ఆహారాన్ని తీసుకుంటుంది. అయితే ఉత్తర పసిఫిక్ హంప్‌బ్యాక్ తిమింగలాలు రోజుకు 9 టన్నుల క్రిల్ తినగలవు. ఫిన్ తిమింగలాలైతే 8 టన్నులు తింటాయి. ఇక ఆర్కిటిక్ బోహెడ్ తిమింగలాలు రోజుకు 6 టన్నుల కోపెపాడ్స్, నార్త్ అట్లాంటిక్ రైట్ వేల్స్ 5 టన్నుల కోపెపాడ్స్, సౌత్ అట్లాంటిక్ బ్రైడ్ అయితే టన్ను చేపలు, సదరన్ ఓషన్ మింకే 0.69 టన్నుల క్రిల్స్‌ను ఆహారంగా తీసుకుంటాయి.
అంతేకాదు ఇవి విభిన్నమైన ‘ఫీడింగ్ స్ట్రాటజీస్’ అమలు చేస్తుంటాయి. రైట్ అండ్ బోహెడ్ వేల్స్ ‘కంటిన్యూస్/రామ్’ ఫీడింగ్‌గా పిలువబడే స్ట్రాటజీని ఉపయోగించి, ఓపెన్ మౌత్‌తో వెళ్లడం ద్వారా క్రస్టేసియన్లను వేటాడతాయి. బ్లూ, ఫిన్, హంప్‌బ్యాక్ తిమింగలాలు ‘లంగ్’ ఫీడింగ్ స్ట్రాటజీని అప్లయ్ చేస్తాయి. ఊపిరితిత్తుల వ్యూహాన్ని అనుసరించే ఒక తిమింగలం రోజుకు 17000 క్యూబిక్ మీటర్ల వరకు నీటిని ఫిల్టర్ చేస్తే, కంటిన్యూస్/ రామ్ ఫీడింగ్‌లో అంతకన్నా నాలుగు రెట్లు ఎక్కువ ప్రాసెస్ చేస్తాయి.
ఐరన్ సైకిల్
ఫుడ్ చైయిన్‌లో అగ్ర మాంసాహారులు తిమింగలాలు కాగా, ఇవి ఎకో సిస్టమ్‌ను బ్యాలెన్స్ చేయడంలో కీలక పాత్ర పోషిస్తాయి. వీటిలో ప్రధానమైంది ‘మెరైన్ ఐరన్ సైకిల్’. సముద్రంలో ఎక్కువ ఐరన్ బయోమాస్‌లో ఉంటుంది. సముద్రంలో ఐరన్ అతి ఎక్కువగా ఉండేది క్రిల్ జాతుల్లోనే. అయితే వేల్స్ వీటిని తిన్న తర్వాత ఐరన్‌తో కూడిన మలాన్ని విసర్జన చేస్తాయి. వీటిని ప్లాంక్టోనిక్ కమ్యూనిటీ తినగా, తిరిగి వాటిని క్రిల్ తింటుంది ఇలా సైకిల్ కొనసాగుతుంది. 2010 అధ్యయనం ప్రకారం, తిమింగలం మలంలోని ఇనుము మొత్తం ‘అంటార్కిటిక్ సముద్రపు నీటి కంటే పది మిలియన్ రెట్లు’ ఉంటుందని అంచనా వేసింది, అయితే ప్రస్తుత అధ్యయనం తిమింగలాలు ప్రతీ సంవత్సరం 7000 నుంచి 15000 టన్నుల ఇనుమును రీసైకిల్ చేయగలవని పేర్కొంది.
https://twitter.com/DJShearwater/status/1455955428462891012/photo/1