- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కరోనాకి ముందులా జొమాటో ఫుడ్ డెలివరీలు
దిశ, వెబ్‌డెస్క్: భారత్‌లో ఫుడ్ డెలివరీలు కరోనాకు ముందునాటి స్థాయికి చేరుకున్నాయని జొమాటో సీఈవో దీపిందర్ గోయల్ తెలిపారు. దేశీయంగా ఫుడ్ డెలివరీలు కరోనాకు ముందుస్థాయికి చేరుకోవడం సంతోషంగా ఉందని, ప్రధాన నగరాల్లో కరోనాకు ముందున్న దాంట్లో 120 శాతానికి పైగా పెరిగాయని చెప్పారు. రానున్న రోజుల్లో ఫుడ్ డెలివరీ విభాగం 15-25 శాతం నెలవారీ వృద్ధిని సాధిస్తుందనే నమ్మకముందని దీపిందర్ పేర్కొన్నారు.
సెప్టెంబర్‌లో ఫుడ్ డెలివరీ అమ్మకాలు ప్రీ-కోవిడ్-19 స్థాయిలో 85 శాతాన్ని తాకినట్టు దీపిందర్ ప్రస్తావించారు. ఈ ఏడాది మార్చిలో లాక్‌డౌన్ ప్రకటించిన రోజు నుంచి 9.2 కోట్ల ఫుడ్ డెలివరీ ఆర్డర్లను అందుకున్నామని, ఇప్పటివరకు తమ డెలివరీ ఏజెంట్ల నుంచి కొవిడ్-19 సోకలేదని దీపిందర్ స్పష్టం చేశారు. తమ డెలివరీ ఏజెంట్లు కానీ, రెస్టారెంట్ల భాగస్వాములు కానీ కొవిడ్ విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు.
అంతర్జాతీయ స్థాయి భద్రతా ప్రమాణాలను అమలు చేయడం ద్వారా తమ వినియోగదారులకు సురక్షితమైన సేవలను అందిస్తున్నామని, ప్రధానంగా డెలివరీ ఏజెంట్లు, రెస్టారెంట్ భాగస్వాముల కృషికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్టు దీపిందర్ గోయెల్ చెప్పారు.