- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
పెద్ద ఎత్తున మొక్కలు నాటాలి: కలెక్టర్
దిశ, రంగారెడ్డి: రుతుపవనాల రాకతో విస్తారంగా వర్షాలు పడుతున్నందున నేపథ్యంలో పెద్దఎత్తున మొక్కలు నాటేందుకు సన్నద్దం కావాలని కలెక్టర్ అమయ్‌కుమార్ గురువారం అధికారులను ఆదేశించారు. గ్రామాలు, మున్సిపాలిటీల్లో మొక్కలు నాటేందుకు గుంతల తవ్వకాలను యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలన్నారు. గతంలో మాదిరిగా కాకుండా ఈసారి ప్రత్యేకంగా గ్రీన్ బడ్జెట్‌ను కేటాయిస్తున్నట్టు సీఎం ప్రకటించిన విషయాన్ని గుర్తుచేశారు. రహదారుల వెంట నాటే మొక్కలు కనీసం ఆరు అడుగుల ఎత్తు ఉండాలని, ఈ సామాజిక వనాల పెంపునకై మొక్కలను అటవీ శాఖ నుండి సేకరించాలని కలెక్టర్ సూచించారు. రోడ్ల వెంట చేపట్టే గుల్ మొహర్, పగోడా మొక్కలను ఒకే వరుసలో కాకుండా రెండు మూడు వరుసల్లో నాటాలని, దీనివల్ల చెట్లు దట్టంగా పెరిగి రహదారులకు మంచి అందం వస్తుందన్నారు. నాటే ప్రతీ మొక్కకు తప్పని సరిగా ట్రీ గార్డును ఏర్పాటు చేసుకోవాలని, తద్వారా మొక్క పడిపోకుండా ఉండడమే కాకుండా రక్షణ లభిస్తుందని తెలిపారు. గత హరితహారాల్లో నాటిన మొక్కల్లో ఏవైనా చనిపోతే వాటి స్థానంలో కొత్త మొక్కలను నాటాలని సూచించారు.