సేంద్రీయ వ్యవసాయంపై దృష్టి సారించాలి: దత్తాత్రేయ

by Shyam |   ( Updated:2020-12-14 11:30:18.0  )
సేంద్రీయ వ్యవసాయంపై దృష్టి సారించాలి: దత్తాత్రేయ
X

దిశ, జనగామ: సేంద్రీయ వ్యవసాయంపై తెలంగాణ ప్రజలు దృష్టి సారించాలని హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ పిలుపునిచ్చారు. సూర్యాపేట నుంచి జనగామ జిల్లా కేంద్రానికి సోమవారం వచ్చిన ఆయనకు బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఆరుట్ల దశమంతారెడ్డి పుష్ప గుచ్చం అందించి ఘన స్వాగతం పలికారు. అనంతరం గవర్నర్ దత్తాత్రేయ మీడియాతో మాట్లాడుతూ… తెలంగాణలో ఒకప్పుడు నీటి కష్టాలు ఉండేవని ఇప్పుడు నీటి కష్టాలు లేకుండా కేంద్రం అన్ని చర్యలు తీసుకుంటోందని అన్నారు.

ఈ క్రమంలో రైతులు సేంద్రీయ వ్యవసాయంపై దృష్టి సారించాలని చెప్పారు. సేంద్రీయ వ్యవసాయం చేపట్టే రైతులకు కేంద్రం అన్నివిధాలుగా అండగా నిలుస్తుందని పేర్కొన్నారు. సేంద్రీయ వ్యవసాయం చేసే రైతులకు తెలంగాణ ప్రభుత్వం కూడా అండగా నిలవాలని సూచించారు. రసాయనాల కన్నా సేంద్రీయ వ్యవసాయంతో వచ్చే పంటతో ప్రజల ఆరోగ్యాలు బాగుంటాయని వెల్లడించారు.

Advertisement

Next Story

Most Viewed