- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆదిలాబాద్‌లో ఫ్లడ్ సర్వే!
దిశ, ఆదిలాబాద్: వర్షాలే లేవు… ఫ్లడ్ సర్వేలేమిటి అనుకుంటున్నారా? అవును కరోనా కారణంగా కొత్త తరహాలో తెరపైకి వచ్చిన సర్వే ఇదీ! కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణకు వైద్యారోగ్య శాఖ ఫ్లడ్ సర్వేను ప్రయోగాత్మకంగా చేపడుతున్నది. ఈ సర్వే కారణంగా కరోనా ప్రభావిత ప్రాంతాల్లో ఏకకాలంలో లక్షణాలు ఉన్నవారిని గుర్తించడానికి అవకాశం ఉంటుందని అధికారులు భావిస్తున్నారు.
ఫ్లడ్ సర్వే అంటే…
కరోనా ప్రభావిత ప్రాంతాల్లో ఆ వైరస్ లక్షణాలు ఉన్నవారిని గుర్తించేందుకుగాను వైద్యసిబ్బంది రాపిడ్ ఫోర్స్ మాదిరిగా వెళతారు. ఒక్కో కంటైన్‌మెంట్ జోన్‌ను గుర్తించి ఒకేసారి ఎక్కువ టీమ్ లను రంగంలోకి దింపుతారు. ఆశా కార్యకర్తలు, ఏఎన్ఎమ్‌లు, పర్యవేక్షక సిబ్బంది ఒకేసారి ఫీల్డ్ లోకి దిగుతారు. ఇప్పటివరకు ఒక్కో కంటైన్మెంట్ జోన్‌లో ఒకటి లేదా రెండు టీమ్‌లతో సర్వే జరిపారు. కానీ, ఫ్లడ్ సర్వే ప్రకారం ఒక్కో జోన్‌లో కనీసం 10 నుంచి 15 టీమ్‌లతో సర్వే నిర్వహించాలని నిర్ణయించారు. ఆరోగ్య సిబ్బందితోపాటు ఆయా ప్రభుత్వశాఖల అధికారులు, పోలీస్ సిబ్బంది కూడా సర్వేలో పాల్గొనేలా కార్యాచరణ తయారు చేశారు. వీరంతా ఒకేసారి ఒకే కంటైన్మెంట్ జోన్‌కు వెళ్లి ఇంటింటి సర్వే చేస్తారు.
మంచి ఫలితాలు వస్తాయని…
ఫ్లడ్ సర్వే వల్ల కరోనా లక్షణాలు ఉన్నవారి సమాచారం పక్కాగా బయటకు వస్తుందని వైద్య ఆరోగ్య శాఖ అంచనా వేస్తున్నది. ఈ మేరకు గురువారం నిర్మల్ జిల్లా కేంద్రంలో ఫ్లడ్ సర్వేను కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ ప్రారంభించారు. ఫ్లడ్ సర్వే నిర్వహణ వల్ల కంటైన్మెంట్ జోన్ లలో ఒక్కఇల్లు కూడా మిస్ కాకుండా సర్వే జరుగుతున్నదని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. సర్వేకు వైద్య సిబ్బందికి అన్ని ప్రభుత్వశాఖల అధికారులు సహకరించాలని కలెక్టర్ ఆదేశించారు. నిర్మల్ జిల్లాలో 19 మంది కరోనా బాధితులను హైదరాబాద్‌కు తరలించగా ఇద్దరు కోలుకుని డిశ్చార్జ్ అయ్యారని తెలిపారు. మరో వారం కరోనా కేసులు రాకుండా చూస్తే జిల్లాలో తగ్గుముఖం పడుతుందని చెప్పారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ భాస్కర్ రావ్, డీఎంహెచ్ వో వసంతరావ్, జిల్లా నోడల్ అధికారి డాక్టర్ కార్తీక్, వైద్యాధికారి అధికారి అవినాష్, ఎస్పీ శశిధర్ రాజు పాల్గొన్నారు.
Tags: Adilabad, Flood Survey, Collector, Officers, Corona Virus