- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఫ్లిప్‌కార్ట్ కు భారీగా నిధులు.. వాటితో ఏంచేస్తారో తెలుసా..?
దిశ, వెబ్‌డెస్క్: దేశీయ దిగ్గజ ఈ-కామర్స్ కంపెనీ ఫ్లిప్‌కార్ట్ సంస్థ భారీగా నిధులను సమీకరించినట్టు ప్రకటించింది. సాఫ్ట్‌బ్యాంక్ విజన్ ఫండ్2, జీఐసీ, కెనడా పెన్షన్ ప్లాన్ ఇన్వెస్ట్‌మెంట్ బోర్డ్, వాల్‌మార్ట్ సహా ఇతర సంస్థల నుంచి 3.6 బిలియన్ డాలర్లు(రూ. 26 వేల కోట్లు) సమీకరించినట్టు వెల్లడించింది. ఈ కొత్త నిధులతో ఫ్లిప్‌కార్ట్ కంపెనీ విలువ 37.6 బిలియన్ డాలర్లు(రూ. 2.8 లక్షల కోట్లు)ను చేరుకున్నట్టు తెలిపింది. కొత్తగా సాధించిన నిధులను కంపెనీ టెక్నాలజీ అభివృద్ధికి, సరఫరా వ్యవస్థను మరింత పటిష్టం చేసేందుకు, మౌలిక సదుపాయాలు, వేగంగా వృద్ధి చెందుతున్న వినియోగదారుల డిమాండ్ కోసం వినియోగిస్తామని ఫ్లిప్‌కార్ట్ ఓ ప్రకటనలో వివరించింది.
ఫ్లిప్‌కార్ట్‌కు నిధులను సమకూర్చిన సంస్థల జాబితాలో సావరీన్ ఫండ్స్ డిస్‌రప్ట్ఏడీ, ఖతాత్ ఇన్వెస్ట్‌మెంట్ అథారిటీ, టైగర్ గ్లోబల్, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్‌లు ఉన్నాయి. “కిరాణా వ్యాపారులతో పాటు భారత్‌లోని చిన్న, మధ్య తరహా వ్యాపారాల వృద్ధిని వేగవంతం చేయడంపై దృష్టి సారిస్తాం. అంతర్జాతీయ స్థాయిలో సరఫరా వ్యవస్థను అభివృద్ధి చేసేందుకు, మేడ్ ఇన్ ఇండియా కోసం పెట్టుబడులు కొనసాగిస్తామని” ఫ్లిప్‌కార్ట్ గ్రూప్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కల్యాణ్ కృష్ణమూర్తి అన్నారు.