- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అదానీ గ్రూప్‌తో ఫ్లిప్‌కార్ట్ భాగస్వామ్యం
దిశ, వెబ్‌డెస్క్: ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ పెరుగుతున్న ఆన్‌లైన్ వినియోగదారుల సౌకర్యం కోసం తన లాజిస్టిక్స్, డేటా సెంటర్ల సామర్థ్యాలను పెంచే ప్రయత్నాలను మొదలుపెట్టింది. దీనికోసం ప్రముఖ సంస్థ అదానీ గ్రూప్‌తో ఫ్లిప్‌కార్ట్ వాణిజ్య ఒప్పందం కుదుర్చుకున్నట్టు ప్రకటించింది. తన సరఫరా మౌలిక సదుపాయాలను బలోపేతం చేసేందుకు, ఎండ్-టూ-ఎండ్ లాజిస్టిక్ సేవల కోసం అదానీ లాజిస్టిక్స్ లిమిటెడ్‌తో కలిసి పనిచేయనున్నట్టు ఫ్లిప్‌కార్ట్ వివరించింది.
అలాగే, ఫ్లిప్‌కార్ట్ తన మూడో డేటా సెంటర్ కోసం అదానీ కనెక్స్ ద్వారా సాంకేతిక పరిష్కారాలను మెరుగుపరుచుకోనుంది. ఇరు కంపెనీల భాగస్వామ్యం ద్వారా ప్రత్యక్షంగా 2,500 మందికి, పరోక్షంగా వేలమందికి ఉపాధి లభిస్తుందని ఫ్లిప్‌కార్ట్ తెలిపింది. ఈ ఒప్పందం విలువపై ఇరు సంస్థలు స్పందించలేదు. ‘భారత్‌లో మౌలిక సదుపాయాల విషయంలో అదానీ గ్రూప్ తమకెంతో సాయపడనుంది. సరఫరా, సాంకేతిక మౌలిక సదుపాయాలను అదానీ గ్రూప్ సహకారంతో మరింత బలోపేతం చేయనున్నాము. ఫ్లిప్‌కార్ట్‌లో అమ్మకందారుల ద్వారా వినియోగదారులకు ఉత్పత్తులను అందించడంపై దృష్టి సారించామని, తాజా భాగస్వామ్యంతో దేశంలోని ఎంఎస్ఎంఈలు, అమ్మకందారులకు మద్దతిచ్చేందుకు, తమ ఉనికిని, సామర్థ్యాన్ని పెంచేందుకు వీలవుతుందని’ ఫ్లిప్‌కార్ట్ ఫ్రూప్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కల్యాణ్ కృష్ణమూర్తి చెప్పారు.