భారీ డిస్కౌంట్లు, ఆఫర్లతో ఫ్లిప్‌కార్ట్ 'దీపావళి సేల్'!

by Harish |
Flipkart
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ దిగ్గజ ఈ-కామర్స్ ఫ్లిప్‌కార్ట్ కంపెనీ మరోసారి భారీ ఫెస్టివల్ సేల్‌ను ప్రకటించింది. వచ్చే నెలలో దీపావళి పండుగ ఉన్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ఆఫర్లు, రాయితీలతో మరో సేల్ నిర్వహించనుంది. ఈ నెల 28వ తేదీ నుంచి నవంబర్ 3 వరకు ‘బిగ్ దివాళి సేల్’ ఉండనున్నట్టు ఫ్లిప్‌కార్ట్ తెలిపింది. ప్రత్యేకంగా ఎస్‌బీఐ డెబిట్ కార్డు ద్వారా జరిపే కొనుగోళ్లపై వినియోగదారులకు 10 శాతం వరకు రాయితీ ఉంటుందని, ఇంకా అనేక ఉత్పత్తులపై భారీగా డిస్కౌంట్లు, ఆఫర్లు ఇవ్వనున్నట్టు పేర్కొంది.

స్మార్ట్‌ఫోన్‌లు, ట్యాబ్స్‌ సహా అనే వస్తువులపై ఏకంగా 80 శాతం వరకు డిస్కౌంట్ లభిస్తుందని తెలిపింది. అంతేకాకుండా వడ్డీ లేని ఈఎంఐ చెల్లింపులు, ఎక్స్‌ఛేంజ్ ఆఫర్లు, ఉచిత డెలివరీలు, పలు ఎలక్ట్రానిక్స్ వస్తువులపై పెద్ద ఎత్తున తగ్గింపులను ఇవ్వనున్నట్టు వివరించింది. దివాళి సేల్‌లో భాగంగా ఫ్లిప్‌కార్ట్ సంస్థ శాంసంగ్, రెడ్‌మీ, ఎంఐ లాంటి స్మార్ట్‌ఫోన్ బ్రాండ్‌లపై కూడా 80 శాతం వరకు డిస్కౌంట్ అందించనున్నట్టు తెలిపింది. అదేవిధంగా టీవీ సహా పలు గృహోపకరణాలపై 75 శాతం వరకు ఆఫర్లు ఉంటాయని కంపెనీ చెబుతోంది.

వీటితో పాటు దీపావళి పండుగ కోసం విడిగా రోజులో ఉదయం 12 గంటలు, ఉదయం 8 గంటలు, సాయంత్రం 4 గంటలకు ఇలా ‘క్రేజీ డీల్స్’ పేరుతో మరిన్ని ఆఫర్లను వినియోగదారులకు అందించనున్నట్టు కంపెనీ పేర్కొంది. కంప్యూటర్లు, ల్యాప్‌టాప్ వంటి వాటిపై అత్యధికంగా 30 శాతం వరకు తగ్గింపును ఇవ్వనున్నట్టు కంపెనీ వెల్లడించింది.

Advertisement

Next Story