- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రై‘వేటు’.. కొవిడ్ ఆసుపత్రులకు రేట్ ఫిక్స్..
దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. పాజిటివ్ కేసులు వేల సంఖ్యలో నమోదు అవుతున్నాయి. ఈ క్రమంలో రాష్ట్రంలోని ప్రైవేటు ఆసుపత్రులు కరోనా ట్రీట్మెంట్ పేరుతో బాధితులను దోచుకుంటున్నాయి. ట్రీట్మెంట్ పేరు చెప్పి అడ్డూ.. అదుపు లేకుండా లక్షల్లో ఫీజలు వసూలు చేస్తున్నాయి.
ఒకానొక సమయంలో కరోనా ఫీజులు వసూలు విషయంలో ప్రైవేటు ఆసుపత్రుల తీరుపై తెలంగాణ హైకోర్టు కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎక్కువ డబ్బులు వసూలు చేసిన ఆసుపత్రులపై తగు చర్యలు తీసుకోవాలని, బాధితులకు డబ్బు తిరిగి చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ నేపథ్యంలో ప్రైవేటు ఆసుపత్రులు, ల్యాబోరేటరీల్లో కరోనా బాధితులకు చికిత్స కోసం ప్రభుత్వం ఓ జీవోను జారీ చేసింది. ఆసుపత్రుల్లో బెడ్స్, ట్రీట్మెంట్‌కు ఎంత డబ్బు ఛార్జ్ చేయాలో నిర్ణయించింది. అలాగే కరోనా చికిత్సలో భాగంగా వివిధ రకాల స్కానింగ్‌లకు, అంబులెన్స్ చార్జీలను కూడా ఫిక్స్ చేసింది. అంతకంటే ఎక్కువ ఫీజు వసూలు చేస్తే సదరు ప్రైవేటు ఆసుపత్రులపై కఠిన చర్యలు తీసుకుంటామని సర్కార్ హెచ్చరించింది.
ప్రభుత్వం జారీ చేసిన జీవో ప్రకారం ధరలు..
1. జనరల్ వార్డ్‌లో పాటు ఐసోలేషన్ ఉంటే.. రూ. 4,000/-
2. ఐసీయూలో ఉండి వెంటిలేటర్ లేకుండా ట్రీట్మెంట్.. రూ. 7,500/-
3. ఐసీయూలో ఉండి వెంటిలేటర్‌పై చికిత్స తీసుకుంటే.. రూ. 9,000/-
4. పీపీఈ కిట్ ధర రూ. 273/-
వివిధ రకాల స్కానింగ్ ధరలు..
1. HRCT.. రూ. 1,995/-
2. IL-6.. రూ. 1,300/-
3. Digital X Ray.. రూ. 300/-
4. D-Dimer.. రూ. 800/-
5. CRP.. రూ. 500/-
6. Procalcitonin.. రూ. 1400/-
7. Ferritin.. రూ. 400/-
8. LDH.. రూ.140/-
కరోనా బాధితుల కోసం అంబులెన్స్ ధరలు..
Basic Life Supporting System..
1. కిలోమీటర్‌కు.. రూ. 75/-, మినిమమ్ చార్జ్- 2,000/-
Advance Life Supporting System..
1. కిలోమీటర్‌కు.. రూ. 125/-, మినిమమ్ చార్జ్- 3,000/-.