అక్కడ మళ్లీ కాల్పులు.. మరో ఐదుగురు బలి

by vinod kumar |
అక్కడ మళ్లీ కాల్పులు.. మరో ఐదుగురు బలి
X

వాషింగ్టన్: అమెరికాలో మరోసారి కాల్పులు బీభత్సం జరిగింది. మేరిలాండ్ రాష్ట్రంలో మూడు చోట్ల జరిగిన కాల్పుల్లో ఐదుగురు మరణించినట్టు పోలీసులు తెలిపారు. ఈ మూడు ఘటనలకు సంబంధమున్నదని, కాల్పులకు తెగబడింది జోషువా గ్రీన్ అనే యువకుడని వెల్లడించారు. అనంతరం ఆ ఉన్మాది అదే తుపాకీతో తనను తాను కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడినట్టు వివరించారు. మేరీలాండ్‌లో బాల్టీమోర్‌లోని ఓ కన్వీనెన్స్ స్టోర్‌ దగ్గర తొలుత గ్రీన్ కాల్పులు జరిపాడు. ఇందులో ఇద్దరు పౌరులు మరణించారు. మరొక పౌరుడు తీవ్రంగా గాయపడ్డారు. అనంతరం తానుంటున్న హార్ట్‌లాండ్ రిడ్జ్ అపార్ట్‌మెంట్‌కు వెళ్లి నిప్పంటించాడని, అందులో ఒకరు మరణించారని బాల్టీమోర్ పోలీసులు వివరించారు. అక్కడే పార్కింగ్‌ లాట్‌లో గ్రీన్ తనను తాను కాల్చుకున్నాడని తెలిపారు. గ్రీన్ తల్లిదండ్రుల ఇంటిలోనూ రెండు మృతదేహాలూ లభించాయని వివరించారు.

Advertisement

Next Story

Most Viewed