ఉద్యోగాల పేరుతో భారీ మోసం

by Sumithra |   ( Updated:2020-11-05 05:02:37.0  )
ఉద్యోగాల పేరుతో భారీ మోసం
X

దిశ, వెబ్‌డెస్క్: దేశరాజధాని ఢిల్లీలో ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. ఆరోగ్య శాఖలో ఉద్యోగాలు ఇప్పిస్తామని ఆశ చూపి దాదాపు 27 వేల మందిని మోసగించిన నిందితులను సైబర్ క్రైం పోలీసులు అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళితే.. ఢిల్లీలోని ఆరోగ్య శాఖలో వేల పోస్టులు ఖాళీగా ఉన్నాయని కొందరు దుండగులు నకిలీ వెబ్సైట్ ద్వారా నిరుద్యోగులను నమ్మించారు. తొలుత 13వేల నకిలీ ఉద్యోగ ఆఫర్లు ప్రకటించగా.. అది నిజమని నమ్మి 27 వేల మంది నిరుద్యోగులు ఆన్ లైన్ ద్వారా వారిని సంప్రదించారు.

అప్లికేషన్ల పేరుతో అభ్యర్థుల నుంచి సుమారు కోటికి పైగా డబ్బులు వసూలు చేసినట్లు సమాచారం. ఆ తర్వాత వెబ్‌సై‌ట్‌లో ఎలాంటి సమాచారం లేకపోవడంతో మోసపోయినట్లు గ్రహించిన నిరుద్యోగులు పోలీసులను ఆశ్రయించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించిన సైబర్ క్రైం పోలీసులు ఐదుగురిని అరెస్టు చేశారు. నిందితుల నుంచి రూ.49 లక్షల నగదు, 3 ల్యాప్ ట్యాప్స్, 7 సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.

Advertisement

Next Story