మావోయిస్టు మిలీషియా సభ్యుల అరెస్టు

by Sridhar Babu |
మావోయిస్టు మిలీషియా సభ్యుల అరెస్టు
X

దిశ, భద్రాచలం: ఐదుగురు మావోయిస్టు మిలీషియా సభ్యులను చర్ల పోలీసులు అరెస్టు చేసినట్టు భద్రాచలం ఏఎస్పీ రాజేష్‌చంద్ర తెలిపారు. ఈ సందర్భంగా రాజేష్‌చంద్ర మీడియాతో మాట్లాడుతూ… చర్ల పోలీసులు పట్టణంలో పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా, గాంధీసెంటర్‌లో పూసుగుప్ప అటవీప్రాంతం వైపు వెళ్ళే దారిలో అనుమానాస్పదంగా కనిపించిన ఐదుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని ప్రశ్నించారు. దీంతో వారు ఛత్తీస్‌గఢ్ రాష్ట్రానికి చెందిన కోరం జోగా, పొడియం జోగా, బాడిస లక్ష్మా, సోడి లక్మా, కొర్సా సురేష్‌గా పేర్లు తెలియజేశారు. గత నాలుగేండ్లుగా వీరంతా నిషేధిత మావోయిస్టు పార్టీ జేగురుకొండ ఏరియా కమిటీకి చెందిన జగదీష్, నాగమణిలకు కొరియర్లుగా, పార్టీకి సానుభూతిపరులుగా, మిలీషియా కమిటీ సభ్యులుగా పనిచేస్తున్నట్టు విచారణలో తేలిందన్నారు. వీరి వద్ద 20 మీటర్ల ఆలీవ్ గ్రీన్ క్లాత్ పోలీసులు స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు.

Advertisement

Next Story