ఐదు రోజుల ముఖ్యమంత్రి కన్నుమూత

by Anukaran |   ( Updated:2020-11-02 09:39:38.0  )
ఐదు రోజుల ముఖ్యమంత్రి కన్నుమూత
X

దిశ, వెబ్‌డెస్క్: బీహార్ ఎన్నికల వేళ ఆ రాష్ట్రంలో విషాదం చోటుచేసుకుంది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పని చేసిన సతీష్ ప్రసాద్ సింగ్(87) సోమవారం ఢిల్లీలో తుదిశ్వాస విడిచారు. ఆయన భార్య సైతం అక్టోబర్ 28న కన్నుమూశారు. 10 రోజుల క్రితమే భార్యభర్తలు చికిత్స కోసం ఢిల్లీకి వచ్చారు.

కాగా సతీష్ ప్రసాద్ సింగ్.. 1968లో జనవరి 28 నుంచి ఫిబ్రవరి 1 వరకు ముఖ్యమంత్రిగా సేవలందించారు. ఆయన పదవి కాలం కేవలం ఐదు రోజులే కావడం గమనార్హం. అనంతరం ఆయన 1980లో కాంగ్రెస్ అభ్యర్థిగా బీహార్‌లోని ఖగరియా నియోజకవర్గం నుంచి 7వ లోక్‌సభకు ఎన్నికయ్యారు.

ఆ తర్వాత 2013 సెప్టెంబర్ 22న సతీష్ ప్రసాద్ సింగ్ బీజేపీలో చేరారు. అయితే లోక్ సభ ఎన్నికల్లో కుష్వాహ కమ్యూనిటీకి పార్టీ సరైన ప్రాతినిధ్యం ఇవ్వనందుకు నిరసనగా బీజేపీకి రాజీనామా చేశారు. ప్రస్తుతం సతీష్ ప్రసాద్ సింగ్ కుమార్తె సుచిత్రా సిన్హా.. నితీష్ కుమార్ ప్రభుత్వంలో మంత్రిగా కొనసాగుతున్నారు. ప్రసాద్ మృతి పట్ల సీఎం నితీష్ కుమార్ సంతాపం తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed