Prithviraj Sukumaran: ఇది ఒరిజినల్ సినిమానే అనుకుంటారు.. పృథ్వీరాజ్ సుకుమారన్ కామెంట్స్

by sudharani |
Prithviraj Sukumaran: ఇది ఒరిజినల్ సినిమానే అనుకుంటారు.. పృథ్వీరాజ్ సుకుమారన్ కామెంట్స్
X

దిశ, సినిమా: మలయాళ సూపర్‌స్టార్‌ మోహన్‌లాల్ (Mohanlal), డైరెక్టర్ పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran) కాంబోలో తెర‌కెక్కిన భారీ చిత్రం ‘L2: ఎంపురాన్’ (L2: Empuraan). ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా ఈనెల 27న మలయాళం(Malayalam)తో పాటు తెలుగు (Telugu), హిందీ (Hindi), కన్నడ (Kannada) భాషల్లో రిలీజ్ అవుతుంది. ఈ క్రమంలో తాజాగా చిత్రయూనిట్ ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ (Pre-release press meet) నిర్వహించింది. ఈ సందర్భంగా డైరెక్టర్ పృథ్వీరాజ్ సుకుమారన్, మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ మాట్లాడుతూ సినిమాపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

‘తెలుగులో మా సినిమాను రిలీజ్ చేస్తున్న దిల్ రాజ్‌(Dil Raj)కు చాలా థాంక్స్. ఇలాంటి సినిమాను మేం ఎప్పుడూ ట్రై చేయలేదు. ఒరిజినల్ వర్షెన్‌లానే తెలుగు వర్షెన్ ఉంటుంది. తెలుగు డబ్బింగ్ కోసం చాలా కష్టపడ్డాం. చాలా అథాంటిక్‌(Authentic)గా ఉండాలని ప్రయత్నించాం. తెలుగు ప్రేక్షకులు తెలుగు వర్షెన్‌(Telugu version)లో చూస్తే.. ఒరిజినల్ సినిమానే అనుకుంటారు. ఎక్కడా డబ్బింగ్ సినిమా అన్నట్టుగా కనిపించదు. లూసిఫర్ సినిమాను అన్ని భాషల్లో రిలీజ్ చేయలేదు. కానీ అన్ని భాషల్లోకి ఆ చిత్రం రీచ్ అయింది. అందుకే ఇప్పుడు ఈ రెండో పార్ట్‌ను ప్రపంచ వ్యాప్తంగా అన్ని భాషల్లో రిలీజ్ చేస్తున్నాం. బుకింగ్స్ ఓపెన్ (Bookings open) చేసిన వెంటనే అన్నీ హౌస్ ఫుల్స్ అవుతున్నాయి. ఈ రేంజ్ ట్రెండ్ చూసి మేమంతా సర్‌ప్రైజ్ (Surprise) అవుతున్నాం. నా దృష్టిలో మంచి సినిమా చెడ్డ సినిమా అనేది మాత్రమే ఉంటుంది. చిన్న సినిమా పెద్ద సినిమా అనేది ఉండదు. మోహన్‌లాల్ ఇచ్చిన సపోర్ట్, ఆయనకు ఉన్న కాన్ఫిడెన్స్ (Confidence) వల్లే ఈ మూవీని ఇంత గ్రాండియర్‌గా, ఇంత హై బడ్జెట్‌‌లో తీయగలిగాం. ఈ క్రెడిట్ అంతా ఆయనదే. ఈ మూవీ కోసం మోహన్‌లాల్, నేను ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా పని చేశాం. మార్చి 27న మా చిత్రం రాబోతోంది. అందరూ చూసి ఎంజాయ్ చేయండి. మూడో పార్ట్ చేసేలా సపోర్ట్ చేయండి’ అని చెప్పుకొచ్చారు.

Next Story