గంజాయి అక్రమ రవాణాకు చెక్.. ఐదుగురు స్మగ్లర్లు అరెస్ట్

by Sumithra |
cannabis smugglers
X

దిశ, సూర్యాపేట: సూర్యాపేట జిల్లాలో యూవతను టార్గెట్ చేసి గంజాయి సరఫరా చేస్తోన్న గ్యాంగ్‌కు జిల్లా పోలీసులు చెక్ పెట్టారు. గంజాయిని యాషిస్ ఆయిల్‌గా మార్చి అమ్ముతున్నారన్న పక్కా సమాచారంతో సూర్యాపేట, కోదాడ పోలీసులు ఆదివారం దాడులు నిర్వహించారు. ఈ తనిఖీల్లో ఏర్పాటు చేసి రూ.15లక్షల విలువైన 1.5 లీటర్ల యాషిస్ ఆయిల్‌ను స్వాధీనం చేసుకొని, ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్పీ రాజేంద్రప్రసాద్ మీడియాకు వివరాలు వెల్లడిస్తూ.. కోదాడ పట్టణానికి చెందిన బోడేపూడి సురేశ్, నట్టే అనుదీప్ విశాఖ జిల్లా హుకుంపేట గ్రామం నుంచి గంజాయి కొనుగోలు చేసి కోదాడ టౌన్‌లో విక్రయాలకు పాల్పడ్డారు. గతకొన్ని రోజులుగా పోలీసుల నిఘా ఎక్కువ కావడంతో గంజాయిని యాషిస్ ఆయిల్‌గా మార్చి సరఫరా చేస్తున్నారు.

వంతల భీమరాజు, గెమ్మెల్లి జాన్ విక్టర్, గోవింద్ వద్ద 1.5 లీటర్ల యాషిస్ ఆయిల్ రూ.75, 000 కొనుగోలు చేసి కోదాడలో 10 ఎం‌ఎల్ రూ.10 వేలకు అమ్ముకునేలా ప్లాన్ చేశారు. బస్సులో ప్రయాణిస్తే పోలీసులు పట్టుకునే అవకాశం ఉండడంతో జాన్ విక్టర్ కమాండర్ జీప్‌లో వైజాగ్ జిల్లా హుకుంపేట నుండి బయలుదేరారు. ఈ క్రమంలో కోదాడకు చేరుకోగానే కోదాడలోని ఖమ్మం “X” రోడ్డు వద్ద పోలీసులు తనిఖీలు చేసి వీరిని అదుపులోకి తీసుకొన్నారు. అనంతరం వీరి వద్దనుంచి రూ.10 వేల నగదు, కమాండర్ జీపు, 1.5 లీటర్ల యాషిస్ ఆయిల్, ఐదు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. పట్టుకున్న 1.5 లీటర్ల యాషిస్ ఆయిల్ విలువ మార్కెట్ రేట్ ప్రకారం రూ.15 లక్షలు ఉంటుందని ఎస్పీ తెలిపారు. ఈ కేసును ఛేదించిన డీఎస్పీ రఘు, మోహన్ కుమార్, సీ‌ఐ నర్సింహా రావు, కోదాడ టౌన్ సీ‌ఐ నర్సింహా గౌడ్, సీసీఎస్ ఎస్‌ఐ రాంబాబు, సీసీఎస్ సిబ్బందికి ఎస్పీ రాజేంద్ర ప్రసాద్ ప్రసాద్ రివార్డ్స్ అందజేసి అభినందించారు.

Advertisement

Next Story

Most Viewed