- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రజలకు ఆరోగ్యంపై అవగాహన కోసమే ‘ఫిట్ ఇండియా ఫ్రీడమ్ రన్ 2.0’
దిశ, తెలంగాణ బ్యూరో : ప్రజలకు ఆరోగ్యంపై అవగాహన కల్పించేందుకే ‘ఫిట్ ఇండియా ఫ్రీడమ్ రన్ 2.0’ను ప్రారంభిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ గజానన్ మాల్య తెలిపారు. 75వ స్వాతంత్ర్య దినోత్సవం ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ లో భాగంగా సికింద్రాబాద్ రైల్వే స్పోర్ట్స్ కాంప్లెక్స్ గ్రౌండ్(ఆర్‌ఎస్‌సీ) లో గురువారం ఈ రన్ ను ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ ఏడాది ఆగస్టు 13వ తేదీ నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు యువజన వ్యవహారాల, క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ‘ఫిజికల్/వర్చువల్ రన్’ ప్రచారాన్ని జాతీయస్థాయిలో నిర్వహిస్తున్నారన్నారు.
ప్రజలు రోజూ కనీసం 30 నిమిషాలు శారీరక వ్యాయామానికి కేటాయించాలనే ఉద్ధేశ్యంతో ఈ కార్యక్రమాన్ని ప్రోత్సహిస్తున్నట్లు ఆయన చెప్పారు. అనంతరం ఆర్‌ఎస్‌సీ గ్రౌండ్స్‌లో నూతనంగా పునరుద్ధరించిన షటిల్ బాడ్మింటన్ కోర్టును ఆయన ప్రారంభించారు. ఇదిలా ఉండగా దక్షిణ మధ్య రైల్వే మహిళా సంక్షేమ సంఘం అధ్యక్షురాలు జయంతి మాల్య రైల్వే పరిసరాలలో పర్యావరణ పరిరక్షణ కోసం మొక్కలను నాటారు. దక్షిణ మధ్య రైల్వే అడిషినల్ జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్, ప్రిన్సిపల్ చీఫ్ మెకానికల్ ఇంజినీర్, స్పోర్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు జేకే జైన్, పలు విభాగాల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.