- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కళ్లముందే ప్రాణాలు పోతున్నా.. మూసీలో చేపల వేట!
దిశ ప్రతినిధి, హైదరాబాద్: మూసీనదిలో పడి అనేకమంది ప్రాణాలు కోల్పోతున్నప్పటికీ స్థానికంగా నివాసముండే వారిలో కొంతమంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఓ వైపు నదిలో నీరు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నప్పటికీ లెక్క చేయకుండా నీటిలోకి వెళ్లి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు మూసీకి వరద పోటెత్తింది. దీంతో అధికారులు ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. రెండ్రోజుల క్రితం ఓల్డ్ మలక్‌పేట్‌లో మూసీలో ఈతకు వెళ్లిన వ్యక్తి కుమారుని కండ్ల ముందే నీటిలో పడికొట్టుకుపోయిన విషయం తెలిసిందే. ఇలాంటి సంఘటనలు స్థానికంగా నివాసముండే వారి కళ్లు ఏమాత్రం తెరిపించడం లేదు. పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా నీటిలో చేపలు పట్టడానికి వెళ్తున్నారు. కొంతమంది ఏకంగా వలలు, బుట్టలు తీసుకుని మూసీనదిలోకి దిగి చేపలు పడుతున్నారు. పిల్లలకు జాగ్రత్తలు చెప్పాల్సిన పెద్దలు కూడా వారితో కలిసి మూసీ నీటిలోకి దిగుతుండడం నిర్లక్ష్య పరిస్థితికి అద్దం పడుతోంది.
భద్రతా చర్యలేవి..?
మూసీ నదికి ఇరువైపులా ఎక్కడి నుండైనా నీటి వద్దకు వెళ్లడానికి వీలుంది. ముఖ్యంగా చాదర్ ఘాట్, అంబర్ పేట్, కొత్తపేట, నాగోల్ ప్రాంతాలలో సమీపంగా నివాసముండే వారు కొంతమంది కాలకృత్యాలకు సైతం మూసీ నీటిలోకి దిగుతున్నారు. ఇలా దిగిన సందర్భంలో కాలు జారీ నీటిలో పడిపోతున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల మూసీ నీటిలో గుర్తు తెలియని మృతదేహాలు సైతం కొట్టకువచ్చిన విషయం తెలిసిందే. కండ్ల ముందే ఇలా పిల్లలు, పెద్దలు మూసీ నీటిలోకి దిగి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నా అధికారులు ఎలాంటి రక్షణ, భద్రతా చర్యలు చేపట్టడం లేదు. గతంలో చోటు చేసుకున్న సంఘటనలు వారి కండ్లు తెర్పించడం లేదని ప్రజలు విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు మూసీకి ఇరువైపులా నీటిలోకి వెళ్లకుండా తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.