- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సంబరపడిన మత్స్యకారులకు చేదు అనుభవం
by Aamani |
X
దిశ ప్రతినిధి, ఆదిలాబాద్:
చేపలను పట్టేందుకు మత్స్యకారులు చెరువులో వల వేస్తే… అనకొండ చిక్కిన ఘటన నిర్మల్ జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లాలోని పెంబి మండల కేంద్రానికి సమీపంలో ఉన్న భీమన్న చెరువులో చేపల వేటలో భాగంగా మత్స్యకారులు సోమవారం సాయంత్రం వల వేశారు. చెరువుకు మంగళవారం వెళ్ళిన మత్స్యకారులు వలను లాగే ప్రయత్నం చేశారు. వల బరువుగా ఉండడంతో మత్స్యకారులు సంబరపడ్డారు. భారీగా చేపలు చిక్కాయని సంతోషంతో వలను ఒడ్డుకు లాగి చూశారు. కాగా వలలో పెద్ద అనకొండ కనిపించింది. దీంతో ఒక్కసారిగా ఆందోళనకు గురైన మత్స్యకారులు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. పెంబి అటవీ రేంజ్ సిబ్బంది అక్కడికి చేరుకుని అనకొండను సమీప అటవీ ప్రాంతంలో వదిలి పెట్టారు.
Advertisement
Next Story