ప్రియాంక ప్రేమకథ మొదలైంది అక్కడే..

by Jakkula Samataha |
ప్రియాంక ప్రేమకథ మొదలైంది అక్కడే..
X

యూనివర్సల్ హీరోయిన్ ప్రియాంక చోప్రా తన భర్త నిక్ జోనస్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఎప్పుడు చూసినా ఫుల్ హుషార్‌గా కనిపించే ఈ జంట.. ఒకరికొకరు రెస్పెక్ట్ ఇచ్చుకుంటూ ఎవరి ఫీల్డ్‌లో వారు రాణిస్తున్నారు. మీడియానే కాదు సోషల్ మీడియాలోనూ ఫుల్ క్రేజ్ ఉన్న ఈ లవ్‌లీ కపుల్‌కు.. వరల్డ్ వైడ్‌గా ఫుల్ ఫాలోయింగ్ ఉంది. ప్రేమ, పెళ్లికి వయసుతో సంబంధం లేదని, ఇద్దరి మనసులు ఒకటై జీవితాంతం స్నేహంగా ఉంటే చాలనుకున్న ప్రియాంక.. తనకన్నా చిన్నవాడైనా సరే, ‘నిక్’ చేయి పట్టుకుని విడవలేదు. ఎన్ని విమర్శలొచ్చినా ఎదుర్కొంది. భారత సంప్రదాయం ప్రకారం అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకుని.. ప్రస్తుతం హ్యాపీ లైఫ్‌ను లీడ్ చేస్తోంది. కాగా ఈ బంధానికి ఎక్కడ పునాది పడిందో తెలుపుతూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది ఈ భామ.

సరిగ్గా రెండేళ్ల క్రితం లాస్ ఏంజిల్స్‌లోని డాడ్గర్ స్టేడియంలో నిక్‌తో కలిసి ఫస్ట్ ఫోటో తీసుకున్నానని తెలుపుతూ.. ఆ పిక్ షేర్ చేసింది ప్రియాంక. ఆ రోజు నుంచి నేటి వరకు ప్రతీ రోజును జాయ్‌ఫుల్‌గా, హ్యాపీగా తీర్చిదిద్దిన నిక్‌కు థ్యాంక్స్ చెప్పింది. ‘మన ఇద్దరి జీవితాలను ఇంత గొప్పగా సెలబ్రేట్ చేసుకునేలా చేసిన నిక్.. ఐ లవ్ యూ’ అంటూ తన ప్రేమను వ్యక్తపరిచింది. కాగా ఈ పిక్ చూసిన నెటిజన్లు ఫిదా అయిపోయారు.

Advertisement

Next Story

Most Viewed