- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఏపీలో తొలి జీఎస్టీ అరెస్టు
ఆంధ్రప్రదేశ్‌లో తొలి జీఎస్టీ అరెస్టు జరిగింది. విశాఖపట్టణం వాణిజ్య పన్నుల శాఖ ( రాష్ట్ర వస్తుసేవల పన్ను ) జాయింట్ కమీషనర్ ఆధ్వర్యంలో గాజువాక సర్కిల్ అసిస్టెంట్ కమీషనర్, డిప్యూటీ అసిస్టెంట్ కమీషనర్‌తో కలిసి శేఖర్ ట్రేడర్స్ మరియు వెంకటసాయి ట్రేడర్స్ యజమాని దుడ్డు శేఖర్ షాపులతో పాటు, కార్యాలయాల్లో తనిఖీలు నిర్వహించారు. శేఖర్ పాత ఇనుము వ్యాపారం కోసం గాజువాక సర్కిల్‌లో రిజిస్ట్రేషన్‌తో శేఖర్ ట్రేడర్స్, వెంకటసాయి ట్రేడర్స్ పెట్టాడు. శేఖర్ అక్రమ విధానాల ద్వారా ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్నులను ఎగ్గొట్టాడని సోదాల్లో గుర్తించారు. సుమారు 14 . 40 కోట్ల రూపాయల టర్నోవరుపై 2 కోట్ల 60 లక్షల రూపాయల పన్ను చెల్లించాల్సి ఉందిని అధికారులు వెల్లడించారు.
ఆన్‌లైన్ వే బిల్లులతో మోసానికి పాల్పడినట్టు గుర్తించారు. తెలంగాణాలోని వ్యాపారులకు సామగ్రిని విక్రయించడం తిరిగి వారి నుంచి అవే వస్తువులు కొన్నట్టు చూపించడం చేయడం ద్వారా సుమారు 10 కోట్ల రూపాయల విలువైన పన్నుచెల్లించకుండా ఎగ్గొట్టాడని చీఫ్ స్టేట్ టాక్స్ ఆఫీసర్ తెలిపారు. దీంతో ఆయనపై ఏపీ జీఎస్టీ చట్టం 2017లోని 132వ సెక్షన్ ప్రకారం నేరం చేసినట్టు నిర్ధారించారు. దీంతో అతనిని అరెస్టు చేసి ప్రత్యేక ఆర్థిక నేరాలు మరియు జిల్లా సెషన్స్ జడ్జి ముందు ప్రవేశపెట్టారు. దీంతో న్యాయస్థానం అతనికి జూడిషియల్ రిమాండ్ విధించింది. అతని నుంచి పన్నులు పూర్తిగా వసూలు చేస్తామని చీఫ్ కమీషనర్ ఆఫ్ స్టేట్ టాక్స్ ఏపీ పియూష్ కుమార్ తెలిపారు.