‘కామ’ఖాకీ.. ఏ స్థితిలో దొరికిపోయాడంటే..!

by Anukaran |   ( Updated:2020-12-20 05:32:10.0  )
‘కామ’ఖాకీ.. ఏ స్థితిలో దొరికిపోయాడంటే..!
X

దిశ, వెబ్‌డెస్క్ : ప్రజల మానప్రాణాలు, ఆస్తులను కాపాడాల్సిన వాళ్లే వాటితో ఆటలు ఆడుతున్నారు. బాధ్యతాయుత ఉద్యోగంలో ఉండి యువతకు స్ఫూర్తిదాయకంగా ఉండాల్సిన వాళ్లు వారిలోని విలనిజాన్ని వికృతంగా బయటపెడుతున్నారు. నెల్లూరు జిల్లాలో కానిస్టేబుల్‌తో రాసలీలలు నడిపిన లేడీ ఎస్ఐ ఘటన మరవక ముందే కృష్ణా జిల్లాలో ఓ ఫైర్‌మెన్ ఓ మహిళతో కామక్రీడల్లో మునిగి రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయాడు. ఇలా ఖాకీ యూనిఫాం పరువు తీస్తున్న అధికారులపై ప్రజలు మండిపడుతున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

కృష్ణా జిల్లా గుడివాడకు చెందిన గొరిపర్తి శ్రీనివాసరావు ఫైర్‌మెన్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. ఐదేళ్ల క్రితం లక్ష్మిని వివాహం చేసుకున్న ఆయన.. తరుచూ కట్నం పేరుతో వేదింపులకు పాల్పడుతూ రెండేళ్ల క్రితం పుట్టింటికి పంపించాడు. ఆ తర్వాత గన్నవరం మండలం దావాజీగూడెనికి చెందిన యువతితో శ్రీనివాసరావు ప్రేమపేరుతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. అక్కడే ఓ ఇల్లును అద్దెకు తీసుకోని ఆమెతో సహజీవనం చేస్తున్నాడు.

విషయం తెలుసుకున్న భార్య.. తన బంధువులతో కలిసి ప్రియురాలితో తన భర్త ఉంటున్న ఇంటికి వెళ్లింది. ఇంట్లో రాసలీలల్లో మునిగి తేలుతున్న ఇద్దరిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది. ఆగ్రహంతో ఆ ఇద్దరిపై దాడి చేసింది. భర్త శ్రీనివాసరావుకు దేహశుద్ధి చేసింది. నగ్నంగా ఉన్న అతడిని బయటకు లాగింది.తనతో కాపురం చేయడానికి కట్నం కావాలి.. పరాయి స్త్రీతో చేయడానికి కట్నం అవసరం లేదా అని ఊగిపోయింది. అనంతరం బంధువుల సహాయంతో గన్నవరం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.

స్టేషన్ వదిలి.. బెడ్‌రూంలో దూరిన మహిళా ఎస్ఐ, కానిస్టేబుల్

Advertisement

Next Story

Most Viewed