అగ్నిమాపక వాహనమే అంబులెన్స్ అయితే…?

దిశ, వెబ్ డెస్క్: విజయనగరం జిల్లా చీపురుపల్లిలో అగ్నిమాపక సిబ్బంది మానవత్వాన్ని చాటుకున్నారు. గురువారం అగ్నిమాపక కేంద్రం ఎదురుగా రెండు బైకులు ఢీకొన్న రోడ్డు ప్రమాదంలో ఒకరి తలకి బలమైన గాయం అయింది. మరొకరికి స్వల్ప గాయాలయ్యాయి.

108 కోసం ఎదురుచూసే సమయంలేనందున అగ్నిమాపక ఎస్ ఐ చొరవతో క్షతగాత్రులను అగ్నిమాపక వాహనంలోనే హుటాహుటిన స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. 108 కోసం ఎదురుచూస్తూ లేటయి ఉంటే ప్రాణం పోయేది అని డాక్టర్లు తెలిపారు. దీంతో ప్రాణం కాపాడిన ఆనందంతో గర్వంగా అనిపించిందని అగ్నిమాపక సిబ్బంది చెప్తున్నారు. స్థానికులు వీరిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

Advertisement