- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వరంగల్ అడవుల్లో అగ్గి తగ్గేదెట్లా..?
దిశ, వరంగల్: ఎండలు దంచి కొడుతున్నాయి.. చెట్ల ఆకులు రాలుతున్నాయి.. ఎక్కడో చిన్నగా లేచిన నిప్పురవ్వతో ఎండిన ఆకులు అంటుకుని అడవులు కాలిపోతున్నాయి. ఆ మంటల ధాటికి తట్టుకోలేని జంతువులు, పక్షులు బతుకు జీవుడా అంటూ జనారణ్యంలోకి పరుగులు పెడుతున్నాయి. దీంతో సమీప గ్రామస్తులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఇంత జరుగుతున్నా.. ఫారెస్ట్ అధికారులు మాత్రం నిర్లక్ష్యం వహిస్తున్నారు. దీంతో బాధితులు వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఉమ్మడి వరంగల్ జిల్లా ఏటూరు నాగారం ఏజెన్సీలోని అడవులు అగ్నికి ఆహుతి అవుతున్నాయి. అడవుల్లో పశువుల కాపరులు బీడి తాగి పడేయటం, వన భోజనాలకు వెళ్లినవారు నిప్పు చల్లార్చకపోవడం వల్ల ప్రమాదవశాత్తు నిప్పంటుకుని మంటలు ఎగిసిపడుతున్నాయి. సమయానికి మంటలు ఆర్పేవారు లేకపోవటం వల్ల అడవులు కాలి బూడిదవుతున్నాయి. అంతేకాకుండా తునికాకు కాంట్రాక్టర్లు లేత ఆకు కోసం అడవులకు నిప్పంటించటం లాంటి చర్యలకు పాల్పడుతున్నట్లు ఆరోపణలున్నాయి. తెలంగాణ సర్కారు మొక్కలు నాటి అడవులను పెంచాలని చెబుతున్నప్పటికీ ఆ శాఖ అధికారులు మాత్రం అటు వైపు కన్నెత్తి చూడని కారణంగా నష్టం వాటిల్లుతోన్నది. దీంతో చెట్లను పెంచి పల్లెల్లోని వన్యప్రాణులు అడవి బాట పట్టేలా చేయాలని చెబుతున్న మాటలు కాగితాలకే పరిమితమయ్యాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఊరిబాట పడుతున్న జంతువులు..
అడవుల్లో మంటలు ఎగిసిపడుతుండటం వల్ల చెట్లు కాలిపోయి అక్కడి జంతువులు సమీప గ్రామాల్లోకి పరుగులు తీస్తున్నాయి. పక్షుల గూళ్లు కాలి బూడిదవుతున్నాయి. మంటల వేడిమికి, అడవంతా వ్యాపించే పొగను తట్టుకోలేక కొన్ని జంతువులు, పక్షులు దూరంగా పారిపోతున్నాయి. ఇక కోతులైతే రోడ్లపై పరుగులు తీస్తుండటంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరికొన్ని చోట్ల కోతులు ఆహారం కోసం ఊర్లోకి వచ్చి ఇండ్లపై దండయాత్ర చేస్తున్నాయి. ఇక ఎలుగుబంట్లు గ్రామాలు, చేల్లోకి వస్తుండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.
చర్యలు తీసుకుంటున్నాం..
‘అడవుల్లో మంటలు చెలరేగిపోతున్నది వాస్తవమే. అడువుల్లో పశువుల కాపరులు బీడి తాగి పడేయటం, వన భోజనాలకు వెళ్లిన వారు నిప్పు చల్లార్చక పోవటంతో అగ్గి రాజుకుంటోన్నది. అడవుల్లో మంటలు లేస్తే… ఆర్పివేసేందుకు ప్రత్యేక టీమ్ లను ఏర్పాటు చేశాం’ అని ములుగు జిల్లా అటవీ అధికారి ప్రదీప్ కుమార్ శెట్టి చెబుతున్నారు.
tags: Warangal, woods, fires, forest officials, animals, victims, mulugu area