ప్లాస్టిక్ ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం..

by Shamantha N |
ప్లాస్టిక్ ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం..
X

దిశ, వెబ్ డెస్క్ : గుజరాత్ అహ్మదాబాద్‌లోని వాట్వాలో ప్లాస్టిక్ కర్మాగారంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది 36 ఫైర్ టెండర్లతో ఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెస్తున్నాయి. ప్లాంట్‌లోని బాయిలర్‌లలో ఒకటి పేలి మంటలు చెలరేగినట్టు సమాచారం. మంటల కారణంగా ఆ ప్రాంతంలో పొగ ఆవరించింది. ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని చీఫ్ ఫైర్ ఆఫీసర్ రాజేష్ భట్ తెలిపారు.

Advertisement

Next Story