షాట్ సర్క్యూట్‌తో షాపు దగ్దం.. లక్షల్లో ఆస్తి నష్టం

by Sridhar Babu |
షాట్ సర్క్యూట్‌తో షాపు దగ్దం.. లక్షల్లో ఆస్తి నష్టం
X

దిశ, గోదావరిఖని : పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ప్రశాంత్ నగర్‌లో శనివారం తెల్లవారుజామున ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. షాట్ సర్క్యూట్‌తో A1 కారు ఏసీ మెకానిక్ షాపులో మంటలు వ్యాపించి పూర్తిగా కాలిపోయింది. షాపు నిర్వాహకులు ఫరిద్ తెలిపిన వివరాల ప్రకారం.. రోజులాగే షాపును సాయంత్రం 6 గంటల సమయంలో మూసివేసి ఇంటికి వెళ్లానని అన్నారు.

ఒక్కసారిగా షాపులో నుండి మంటలు రావడంతో రోడ్డు పక్కన నుండి వెళ్లే స్థానికులు చూసి ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారని పేర్కొన్నారు. ఒక్క రోజు ముందే కారుకు సంబంధించిన లక్ష రూపాయల గ్యాస్‌ను తీసుకువచ్చామని దీంతో షాపు పూర్తిగా కాలిపోయిందని అన్నారు. సుమరుగా 3 లక్షల ఆస్థి నష్టం వాటిల్లిందని పేర్కొన్నారు. మూడు సంవత్సరాలుగా షాపుపైనే ఆధారపడినట్లు కన్నీటి పర్యంతమయ్యారు.

Advertisement

Next Story

Most Viewed