- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కొవిడ్ సంబంధిత వస్తువుల దిగుమతులకు కస్టమ్స్ అనుమతులు రద్దు
దిశ, వెబ్‌డెస్క్: ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ దిగుమతి చేసుకునే కొవిడ్ సంబంధిత రిలీఫ్ వస్తువుల కస్టమ్స్ క్లియరెన్స్ కోసం ప్రభుత్వ శాఖల నుంచి తీసుకునే అనుమతులను రద్దు చేస్తున్నట్టు ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. కొవిడ్ మహమ్మారి కారణంగా ఏర్పడ్డ అసాధారణ పరిస్థితుల నేపథ్యంలో విదేశీ ప్రభుత్వాల నుంచి వచ్చే, దిగుమతి అయ్యే పదార్థాలకు క్లియరెన్స్ సమస్యలు లేకుండా చూడాలని కేంద్ర పరోక్ష పన్నులు, కస్టమ్స్ కార్యాలయం(సీబీఐసీ) సూచించింది. ప్రస్తుత పరిస్థితుల్లో విదేశాంగ శాఖ, ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ ద్వారా దిగుమతి అయిన కరోనా సంబంధిత దిగుమతుల్లో అన్ని వస్తువుల క్లియరెన్స్ కోసం ప్రభుత్వ శాఖ, ఏజెన్సీల నుంచి అవసరమైన అనుమతులు ఇచ్చినట్టు భావించబడుతుందని మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో పేర్కొంది.
కస్టమ్స్ డ్యూటీ, క్లియరెన్స్ విషయాల్లో అత్యున్నత సంస్థ సీబీఐసీ ఈ సరుకులను ‘అత్యధిక ప్రాధాన్యత’ ఇవ్వాలని, సాధ్యమైనంత తక్కువ సమయంలో వాటి క్లియరెన్స్‌ను సులభతరం చేయాలని ఫీల్డ్ ఆఫీసులను కోరింది. ఆక్సిజన్, సంబంధిత పరికరాలతో పాటు విదేశీ ప్రభుత్వాల నుంచి కరోనా సంబంధిత పదార్థాలు, ఔషధాల విరాళాలు కూఉడా భారత ఓడరేవులకు వస్తున్నాయని సీబీఐసీ తెలిపింది. గతవారం కొవిడ్ వ్యాక్సిన్‌ల దిగుమతి, మెడికల్-గ్రేడ్ ఆక్సిజన్, సంబంధిత పరికరాలపై ప్రభుత్వం కస్టమ్స్ సుంకాన్ని మాఫీ చేసిన సంగతి తెలిసిందే.