- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
పెరిగిన ఆర్థిక నేరాలు.. రెండేళ్లలో రూ.623 కోట్లు ఫ్రీజ్
దిశ, క్రైమ్ బ్యూరో : రోజుకో కొత్త పేరుతో పుట్టుకొస్తున్న మోసాల పట్ల ప్రజలను జాగురుకత చేయడం, నేరాలను ఛేదించడం పోలీసులకు సవాల్‌గా నిలుస్తోంది. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో గత రెండేళ్లలో కరక్కాయ, ఎఫ్ఎంఎల్సీ, ప్రో హెల్తీవాజ్, సన్ పరివార్, ఈబిజ్, క్యూనెట్, సెర్ఫా మార్కెటింగ్, స్వధాత్రి, బైక్ బూట్, షేర్ బైక్, ఇండస్ వివా తదితర మద్దు పేర్లతో కంపెనీలను ఏర్పాటు చేస్తున్న మాయగాళ్లు తమ మాటల వలను విసిరి అమాయకులకు గాలం వేస్తున్నారు. అధిక వడ్డీతో సులభంగా డబ్బును సంపాదించాలని అత్యాశ పడేవారు మోసగాళ్ల వలలో చిక్కుకుంటున్నారు.
కమిషనరేట్ పరిధిలో 2018 జూలై 16న ఈ తరహా నేరాల దర్యాప్తునకు ప్రత్యేకంగా ఆర్థిక నేరాల విభాగాన్ని ఏర్పాటు చేశారు. మల్టీ లెవల్ మార్కెటింగ్, డిపాజిట్ల సేకరణ తదితర పేర్లతో అధిక ఆదాయం పొందవచ్చంటూ అమాయకులను నమ్మిస్తున్నారు. తాజాగా మల్టీ లెవల్ మార్కెటింగ్ ఇండస్ వివా పేరుతో అత్యధికంగా కమీషన్ వస్తోందంటే చైన్ పద్ధతిలో దాదాపు 10 లక్షల మంది మోసపోయినట్టుగా, ఈ మోసం రూ.1500 కోట్ల వరకూ ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో గత రెండేళ్లుగా ఈ తరహా మోసాలకు సంబంధించి 13 కేసులు నమోదు కాగా, ఇప్పటి వరకూ 180 మందిని అరెస్టు చేశారు. ఈ కేసులలో సుమారు రూ.623.48 కోట్లను వివిధ బ్యాంకు అకౌంట్‌లలో ఫ్రీజ్ చేయగా, రూ.7.44 కోట్లు నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా పలువురిపై పీడీ నమోదు చేశారు.
మనీ సర్క్యులేషన్స్ స్కీంలు నిషేధం..
మనీ సర్క్యులేషన్స్ పథకాలలో స్నేహితులు, బంధువులే అత్యధికంగా చేరుతున్నారు. డిపాజిట్లపై అధిక వడ్డీ ఆశచూపి ఆకర్షిస్తారు. పార్ట్ టైం ఉద్యోగాల పేరుతో హోమ్ మేకర్స్, రిటైర్డ్ వ్యక్తులు, విద్యార్థులు, యువతను మోసం చేస్తున్నారు. ఈ పథకాలతో దేశ ఆర్థిక వ్యవస్థ కూడా నాశనమవుతోంది. ప్రజలకు ఎవరికైనా కష్టపడి పనిచేయకుండా, డబ్బులు ఊరికే రావు. మల్టీ-లెవల్ మార్కెటింగ్, నెట్‌వర్క్ మార్కెటింగ్, రెఫరల్ మార్కెటింగ్, చైన్ సిస్టమ్ మార్కెటింగ్, డైరెక్ట్ సెల్లింగ్ మొదలైన పేర్లతో ప్రచారమవుతున్న మనీ సర్క్యులేషన్ పథకాలకు బలి కావద్దు.