ఆడటానికి వెళుతున్న దివ్యాంగులకు ఆర్థికసాయం

by srinivas |
helping-1
X

దిశ, ఖమ్మం కల్చరల్: డిసెంబర్ 2, 3 తేదీలలో ముంబయిలో జరుగనున్న టీ20 వీల్ చైర్ క్రికెట్ కప్ 2021 కు ఖమ్మం నుండి ఇద్దరు(బండ్ల రాము, J. సురేష్ అనే ఇద్దరు దివ్యాంగులకు) సెలెక్ట్ అయ్యారు. వారి ఖర్చు నిమిత్తం 10,000 రూపాయలను విజేత ఫౌండేషన్ తరపున వేల్పుల విజేత అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ బాగా ఆడి ట్రోఫీని గెలుచుకుని రావాలని ఖమ్మం జిల్లాకు మంచి పేరు ప్రఖ్యాతలు తేవాలని అన్నారు. తదనంతరం దివ్యాంగులు ఇరువురు మాట్లాడుతూ సహృదయంతో ముందుకు వచ్చి అండగా నిలిచిన వేల్పుల విజేతకు ధన్యవాదాలు తెలిపి.. వారు ఆశించినట్టే విజయంతో వస్తామని పేర్కొన్నారు.

Advertisement

Next Story