- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
జీఎస్టీ వచ్చాకే పన్ను చెల్లింపుల వ్యవస్థలో మార్పులు
దిశ, వెబ్‌డెస్క్: దేశంలో పన్ను రేట్లు తగ్గడంతో పన్ను చెల్లింపుదారుల సంఖ్య పెరిగిందని కేంద్ర ఆర్థిక శాఖ తెలిపింది. మాజీ ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రథమ వర్ధంతి సందర్భంగా ఆ శాఖ ట్విటర్ వేదికగా పలు అంశాల గురించి ట్వీట్లు చేసింది. జీఎస్టీ తీసుకురావడంలో కీలకంగా వ్యవహరించిన అరుణ్ జైట్లీ వల్లనే పన్ను చెల్లింపుల వ్యవస్థలో మార్పులు వచ్చాయని, అలాగే జీఎస్టీ వల్ల కలిగిన లాభాలను వెల్లడించింది.
జీఎస్టీ అనేది వినియోగదారులు, పన్ను చెల్లింపుదారులకు ఫ్రెండ్లీగా మారిందని, జీఎస్టీకి ముందు అధిక పన్ను రేట్లు ఉండగా, ఇప్పుడు తక్కువ పన్ను రేట్లు అమలవుతున్నాయని పేర్కొంది. జీఎస్టీకి ముందు ఎక్సైజ్ పన్ను, వ్యాట్, సేల్స్ ట్యాక్స్ లాంటివి ఉండేవి. దీంతో పన్ను రేటు 31 శాతంతో పన్ను మీద పన్ను చెల్లించాల్సి ఉండేది. జీఎస్టీ వచ్చిన తర్వాత వినియోగదారులకు, పన్ను చెల్లింపుదారులకు లాభమని ఆర్థిక మంత్రిత్వ శాఖ ట్విటర్ ద్వారా తెలిపింది.
జీఎస్టీ వచ్చిన కొత్తలో పన్ను చెల్లింపుదారుల సంఖ్య 65 లక్షలుగా ఉంటే, ప్రస్తుతం అది 1.23 కోట్లకు చేరింది. జీఎస్టీ మినహాయింపు ఇదివరకు రూ. 20 లక్షల టర్నోవర్ ఉన్న వ్యాపారులకు ఇప్పుడు రూ. 40 లక్షలకు మారిందన్నారు. అంతేకాకుండా, పన్నురేటు శ్లాబ్ 230 వస్తువులుగా ఉండేదని, ఇప్పుడు 200కి తగ్గిందని ఆ శాఖ తెలిపింది. కేవలం విలాస వస్తువులు మాత్రమే 28 శాతం శ్లాబులో ఉన్నాయని పేర్కొంది.