మూడు పీఎస్‌బీల్లోని సీఈఓల పదవీకాలన్ని పొడిగించాలని కోరిన మంత్రిత్వ శాఖ

by Harish |
మూడు పీఎస్‌బీల్లోని సీఈఓల పదవీకాలన్ని పొడిగించాలని కోరిన మంత్రిత్వ శాఖ
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ మూడు ప్రభుత్వ రంగ బ్యాంకుల(పీఎస్‌బీ) అధిపతుల పదవీకాలాన్ని పొడిగించాలని సిబ్బంది, శిక్షణ విభాగాన్ని(డీఓపీటీ) ఆర్థిక మంత్రిత్వ శాఖ కోరినట్టు తెలుస్తోంది. అంతేకాకుండా పీఎస్‌బీల్లోని 11 మంది ఎగ్జిక్యూటివ్‌ల పదవీకాలాన్ని కూడా పొడిగించాలని సిఫార్సు చేసినట్టు సమాచారం. పంజాబ్ నేషనల్ బ్యాంక్(పీఎన్‌బీ) ఎండీ, సీఈఓ ఎస్ ఎస్ మల్లికార్జున రావు, యూకో బ్యాంక్ ఎండీ, సీఈఓ అతుల్ కుమార్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఎండీ, సీఈఓ ఏఎస్ రాజీవ్‌ల బాధ్యతలను మరికొంత కాలం కొనసాగించేలా చూడాలని మంత్రిత్వ శాఖ లేఖలో పేర్కొంది.

మళ్లికార్జున రావు సెప్టెంబర్ 18, అతుల్ కుమార్ నవంబర్ 1, రాజీవ్ డిసెంబర్ 1న గడువు పూర్తవనుంది. వీరిని మరో రెండేళ్లు కొనసాగించాలని మంత్రిత్వ శాఖ సిఫార్సు చేసింది. బ్యాంక్స్ బోర్డ్ బ్యూరోతో సంప్రదించిన తర్వాత ఆర్థిక సేవల విభాగం ఈ ప్రతిపాదనను సిబ్బంది, శిక్షణా విభాగానికి పంపినట్టు అధికారిక వర్గాలు తెలిపారు. ఎగ్జిక్యూటివ్‌లలో బ్యాంక్ ఆఫ్ బరోడాకు చెందిన శాంతిలాల్ జైన్, అజయ్ ఖురానా, కెనరా బ్యాంకుకు చెందిన మణిమేఖలై, పీఎన్‌బీలోని సంజయ్, విజయ్ దూబె ఇంకా ఇతరుల పదవీకాలాన్ని పొడిగించేందుకు సిఫార్సు చేసినట్టు అధికారులు వెల్లడించారు.

Advertisement

Next Story

Most Viewed