- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ప్రభుత్వ బ్యాంకుల సీఈవోలతో నిర్మలా సీతారామన్ భేటీ వాయిదా!
దిశ, వెబ్‌డెస్క్: ప్రభుత్వ బ్యాంకుల సీఈవోలతో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ జరపాల్సిన సమీక్షా సమావేశం వాయిదా పడింది. త్వరలో కొత్త తేదీని ప్రకటిస్తామని అధికారులు వెల్లడించారు. కొవిడ్-19 సంక్షోభంతో దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థ కోలుకునే క్రమంలో రుణాల మంజూరుతో పాటు పలు సమస్యలపై బ్యాంకుల సీఈవోలతో ఆర్థిక మంత్రి చర్చించాల్సి ఉంది.
రుణాల రీపేమెంట్లలో మారటోరియం అమలు అంశం, వడ్డీ రేట్ల తగ్గింపు ప్రయోజనాలను బ్యాంకులు వినియోగదారులకు సక్రమంగా అందిస్తున్నాయా లేదా వంటి పలు కీలక అంశాలపై ఆర్థిక మంత్రి సమీక్షించనున్నట్టు శాఖ వర్గాలు పేర్కొన్నాయి. దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ నేపథ్యమంలో ఆర్‌బీఐ వడ్డీ రేట్లపై 75 బేసిస్ పాయింట్ల తగ్గింపును మార్చి 27న ప్రకటించిడంతో పాటు, బ్యాంకు రుణాలపై మూడు నెలల మారటోరియం వంటి ప్రకటనలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నెల ప్రారంభంలో ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ప్రభుత్వ రంగ బ్యాంకు సీఈవోలతో సమావేశాన్ని నిర్వహించి పలు చర్యలను సమీక్షించారు.