- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఆ స్కీమ్ ద్వారా రూ. 17,705 కోట్ల మంజూరు!
దిశ, వెబ్‌డెస్క్: ప్రభుత్వ రంగ బ్యాంకులు జూన్ 5 నాటికి 100 శాతం ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారెంటీ స్కీమ్ కింద రూ. 17,705.64 కోట్ల రుణాలను మంజూరు చేశాయని, వీటిలో రూ. 8,320.24 కోట్ల విలువైన రుణాలు పంపిణీ చేసినట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆదివారం తెలిపింది. ఇందులోనే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గరిష్టంగా రూ. 11,701.06 కోట్ల రుణాలను మంజూరు చేసింది. వీటిలో ఇప్పటికే రూ. 6,084.71 కోట్ల రుణాలు పంపిణీ చేయబడ్డాయని పేర్కొంది. దీనికి సంబంధించిన వివరాలను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ట్విటర్ ద్వారా తెలియజేశారు. పంజాబ్ నేషనల్ బ్యాంక్ రూ. 1,295.59 కోట్ల రూపాయల రుణాలను మంజూరు చేయగా, రూ. 242.92 కోట్ల విలువైన రుణాలను పంపిణీ చేసింది. యూనియన్ బ్యాంక్ రూ. 968.73 కోట్లను మంజూరు చేయగా, రూ. 435.72 కోట్లను పంపిణీ చేసింది. బ్యాంక్ ఆఫ్ బరోడా రూ. 793.77 కోట్లను మంజూరు చేయగా, రూ. 220.14 కోట్ల రుణాలను పంపిణీ చేసింది.
సూక్ష్మ, చిన్న మధ్య తరహా పరిశ్రమలు (ఎంఎస్‌ఎంఈ) కేంద్రం ఇచ్చిన ఎమర్జెన్సీ క్రెడిట్ గ్యారెంటీ స్కీమ్ (జీఈసీఎల్) కు ఉత్సాహంగా స్పందించాయి. ఈ పథకానికి నిబంధనలు విడుదల చేసిన 10 రోజుల్లోపు, 1.5 లక్షలకు పైగా లబ్ధిదారులు ఈ సదుపాయాన్ని పొందారని తెలిసింది. ఈ పథకం కింద 1.5 లక్షల మంది విజయవంతమైన ఎంఎస్‌ఎంఈలు, వ్యాపారాలకు శుక్రవారం వరకు రూ. 13,500 కోట్ల రూపాయల రుణాలు మంజూరు చేసినట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారి తెలిపారు. ఇందులో రూ. 6 వేల కోట్లు ఇప్పటికే పంపిణీ చేయబడ్డాయి.
Twitter Link: https://twitter.com/nsitharamanoffc/status/1269528374851993600/photo/1