- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పంతం నెగ్గించుకున్న శిరీషా..
దిశ, ఆదిలాబాద్ :
ప్రేమించి పెళ్లి చేసుకుంటానని చెప్పి కులాలు వేరు, ఇంట్లో పెద్దలు ఒప్పుకోవడంలేదని మొహం చాటేసిన వ్యక్తినే పెళ్లి చేసుకుని ఓ ప్రేమికురాలు తన పంతాన్ని నెగ్గించుకుంది.వివరాల్లోకి వెళితే..నిర్మల్ జిల్లా మామడ మండలం దిమ్మదుర్తి గ్రామానికి చెందిన శివరాత్రి శిరీష, కోరుకొప్పుల నరేష్ గత నాలుగేళ్లుగా ప్రేమించుకున్నారు.కట్ చేస్తే పెళ్లికి నో అని చెప్పి మొహం చాటేశాడు. దీంతో బుధవారం ఉదయం ప్రియురాలు ప్రియుడి ఇంటి ఎదుట మౌనదీక్ష చేపట్టింది. అమ్మాయి తరఫు బంధువులు, కుటుంబ సభ్యులు ఆందోళన చేయడంతో పోలీసులు జోక్యం చేసుకున్నారు. శిరీష ఎట్టి పరిస్థితుల్లోనూ నరేష్‌తోనే తన వివాహం జరిపించాలని పట్టుబట్టడంతో పోలీసులు నరేష్ కుటుంబ సభ్యులు, గ్రామ పెద్దలతో మాట్లాడి సెట్ చేశారు. చివరకు నరేష్ రాజీకి వచ్చి శిరీషను పెళ్లి చేసుకునేందుకు అంగీకరించాడు. దీంతో గ్రామ పెద్దలు ముందుకు వచ్చి నిర్మల్ పట్టణంలోని సాయిబాబా ఆలయంలో రాత్రి 9గంటల ప్రాంతంలో ప్రేమికులిద్దరికి పెళ్లి జరిపించారు.ఈ ఘటనతో ప్రేమకు కులమతాలు అడ్డురావని, చట్టం కూడా నిజమైన ప్రేమకు చుట్టమవుతుందని మరోసారి రుజువైంది. ప్రేమించిన వాడు మొహం చాటేశాడని ఓ చోట కూర్చోకుండా పెద్దలు, పోలీసుల సాయంతో నచ్చిన వాడిని పెళ్లి చేసుకోవడంలో శిరీష ప్రదర్శించిన తెగువను పలువురు ప్రశంసిస్తున్నారు.
tags ; love dispute, adilabad, marriage over, nirmal, with the help of police and local supporters