ఫైనల్‌గా తెరపై రియా.. ఇదంతా మేకర్స్ గేమ్ ప్లాన్?

by Jakkula Samataha |
ఫైనల్‌గా తెరపై రియా.. ఇదంతా మేకర్స్ గేమ్ ప్లాన్?
X

దిశ, సినిమా : బిగ్ బీ అమితాబ్ బచ్చన్, ఇమ్రాన్ హష్మీ స్టారింగ్ ‘చెహ్రే’ ట్రైలర్ రిలీజైంది. పర్వతాల్లో ప్రమాదకరమైన మంచు తుఫాన్ మధ్య యాడ్ ఏజెన్సీ ఎగ్జిక్యూటివ్ ఇమ్రాన్.. అమితాబ్ ఇంట్లో ఆశ్రయం పొందుతాడు. ఈ క్రమంలో తన ఫ్రెండ్స్‌తో కలిసి క్రైమ్ అండ్ పనిష్మెంట్ గేమ్ ఆడేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తాడు. మొదట ఈ గేమ్ ఇంట్రెస్టింగ్ అండ్ థ్రిల్లింగ్‌గా అనిపించినా.. చివరకు తను ట్రాప్ చేయబడ్డానని రియలైజ్ అవుతాడు. ఆ తర్వాత ఏం జరిగిందనేది కథ.

కాగా, ఈ మూవీలో రియా చక్రవర్తి అప్పియరెన్స్ గురించి చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. సుశాంత్ మర్డర్ కేసు, డ్రగ్స్ కేసులో చిక్కుకున్న తర్వాత రియా పేరు మూవీ కాస్ట్ అండ్ క్రూలో లేకపోవడం, కనీసం ట్విట్టర్ హ్యాండిల్స్‌లో ప్రకటించకపోవడంతో.. ప్రాజెక్ట్ నుంచి తప్పించారనే అనుకున్నారు. తాజాగా మూవీ ప్రొడ్యూసర్ ఆనంద్ పండిట్ కూడా ఈ విషయంపై కరెక్ట్ టైమ్‌లో మాట్లాడతామని తెలిపారు. మొత్తానికి ఈ ట్రైలర్ ద్వారా సమాధానం ఇచ్చినట్లైంది. ట్రైలర్ ఎండింగ్‌లో రియా కనిపించడంతో.. తను సినిమాలో కొనసాగుతున్నట్లు కన్‌ఫర్మ్ అయిపోయింది. దీంతో మేకర్స్ ఇంతకు ముందు ఎందుకు కాస్ట్ అండ్ క్రూ డీటెయిల్స్‌లో తన పేరు యాడ్ చేయలేదనే చర్చ జరుగుతోంది. సుశాంత్ అభిమానులకు భయపడే ఇలా చేసి ఉంటారా? లేదా రియా చక్రవర్తిపై జనాల్లో పాజిటివిటీని పెంచేందుకే.. ఈ సినిమా నుంచి తనను తప్పించినట్టుగా ఫీలర్స్ వదిలారా? అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. మొత్తానికి రియా పేరుతో ‘చెహ్రే’కు కావలసినంత ప్రమోషన్ అయితే దక్కడంతో.. ఇదంతా పబ్లిసిటీ స్టంటేనా? అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.

Advertisement

Next Story