- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఏపీలో కొనసాగుతున్న తుది దశ పోలింగ్
దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో తుది దశ పంచాయతీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఆదివారం ఉదయం 6:30 గంటలకు ప్రారంభమైన పోలింగ్.. మధ్యాహ్నం 3.30 వరకు పోలింగ్ కొనసాగనుంది. అనంతరం సాయంత్రం 4 గంటలకు ఓట్ల లెక్కింపు చేసి ఫలితాలను వెల్లడించనున్నారు. నాలుగో విడతలో భాగంగా 13 జిల్లాల్లోని 161 మండలాల్లో పోలింగ్ జరుగుతోంది. తుది దశలో 3,299 పంచాయతీల్లో సర్పంచ్ స్థానాలకు 554 మంది ఏకగ్రీవమయ్యాయి. రెండు చోట్ల సర్పంచ్ స్థానాలకు, 91 చోట్ల వార్డు సభ్యుల స్థానాలకు నామినేషన్లు దాఖలు కాలేదు.
ఇక మిగిలిన 2,743 స్థానాలకు 7,475 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఇప్పటి వరకు 33,435 వార్డులకు 10,921 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 22,423 వార్డు స్థానాలకు 52,700 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. తుది విడతలో భాగంగా 161 మండలాల్లో మొత్తం 67,75,226 మంది ఓటర్లు ఓటుహక్కు వినియోగించుకోనున్నారు. నాలుగో దశ ఎన్నికల కోసం ఏర్పాటు చేసిన 28,995 పోలింగ్ కేంద్రాల్లో 38 శాతం సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించారు. ఎన్నికలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.