- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బార్బీ బొమ్మగా టెన్నిస్ చాంపియన్ .. మార్కెట్లో ఫుల్ గిరాకీ!
దిశ, ఫీచర్స్ : ఆరు దశాబ్దాలుగా బొమ్మల్లో తన స్థానాన్ని పదిలపరుచుకుంటూ, ప్రతి తరాన్ని ఆకట్టుకుంటూ కొత్త కొత్తగా ముస్తాబవుతున్న ముద్దుగుమ్మ ‘బార్బీ’. సమాజంలో అందరూ సమానమనే భావనను పిల్లల్లో పెంపొందించేలా ఈ బార్బీ బొమ్మలు రూపొందిస్తారు నిర్వాహకులు. ఈ క్రమంలో ప్లాస్టిక్‌తో రీసైకిల్ చేసిన కొత్త రకమైన డాల్స్‌ను విడుదల చేస్తూ.. పర్యావరణాన్ని కాపాడాల్సిన బాధ్యత అందరిపైన ఉందనే మెసేజ్ అందించారు మేకర్స్. ఈ మేరకు ప్రముఖ బార్బీ బొమ్మల తయారీదారీ సంస్థ ‘మాట్టెల్’ టెన్నిస్ చాంపియన్ నవోమి ఒసాకా స్ఫూర్తితో, తన రూపంతో ఉన్న కొత్త రోల్ మోడల్ బార్బీ బొమ్మను విడుదల చేసింది.
టెన్నిస్ స్టార్ ఒసాకా రూపంలో ఈ బార్బీ డాల్‌ను డిజైన్ చేసిన ఘనత ఫిలిప్పినో డిజైనర్ కార్లైల్ న్యూరాకు దక్కుతుంది. 2020 అస్ట్రేలియన్ ఓపెన్ సందర్భంగా ఆమె ధరించిన నైక్ డ్రెస్, బూట్లు, విజర్, యోనెక్స్ టెన్నిస్ రాకెట్ వంటివి ఈ బొమ్మలో ప్రతిబింబిస్తాయి. ‘రికార్డులు బ్రేక్ చేస్తూ రాబోయే తరానికి స్ఫూర్తినిస్తుంది. అథ్లెట్, చేంజ్ మేకర్ నవోమి ఓసాకాను సరికొత్త బార్బీ రోల్ మోడల్ బొమ్మగా మీ ముందుకు తెచ్చినందుకు మేము గర్వపడుతున్నాం’అని మాట్టెల్ ప్రకటించింది. అయితే అధిక డిమాండ్ కారణంగా బొమ్మలు చాలా అమ్ముడయ్యాయని కంపెనీ వెబ్‌సైట్లో పేర్కొంటూ.. ఎక్కువ మొత్తంలో బొమ్మలను మార్కెట్లోకి తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు మేకర్స్.
‘నవోమి ఒసాకా గురించి వ్యక్తిగతంగా ఆరాధించేది ఏమిటంటే.. సామాజిక న్యాయం గురించి అవగాహన పెంచడానికి ఆమె టెన్నిస్ ప్లాట్‌ఫామ్ ఉపయోగిస్తుంది. ఇక తన బొమ్మల ఉత్పత్తిని పెంచడానికి బృందంతో కలిసి పనిచేస్తున్నందుకు గర్వపడుతున్నాను. నవోమి తన బార్బీకి బంగారు ఒంబ్రే జుట్టు, ముత్యాల చెవిరింగులు ఆమెకు మరింత ప్రత్యేకతను తీసుకొచ్చాయి’ అని న్యూరా తన సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు.
23 ఏళ్ల ఒసాకా 2018లో యూఎస్ ఓపెన్ టైటిల్‌ను కైవసం చేసుకున్న తర్వాత గ్రాండ్ స్లామ్ గెలిచిన తొలి జపనీస్ క్రీడాకారిణిగా చరిత్ర సృష్టించింది. ఆ ఫైనల్‌లో టెన్నిస్ పవర్‌హౌస్ సెరెనా విలియమ్స్‌ను ఓడించింది. ఇక ఇప్పటివరకు నాలుగు గ్రాండ్‌స్లామ్ టైటిళ్లను సొంతం చేసుకున్న జపాన్ అగ్రశ్రేణి టెన్నిస్ క్రీడాకారిణి రెండో సీడ్ ఒసాకా.. మానసిక ఆందోళన కారణంగా ఇటీవల జరిగిన ఫ్రెంచ్ ఓపెన్‌లో పార్టిసిపేట్ చేయలేదు.
‘2019లో తొలిసారిగా బార్బీ కంపెనీతో జతకట్టాను. ఈ రోజు బార్బీ రోల్ మోడల్ నవోమి ఒసాకా బొమ్మను మీకు పరిచయం చేస్తున్నాము. ప్రతి ఒక్కరూ ఏదైనా సాధించగలరని గుర్తుపెట్టుకోండి.’ అంటూ ఒసాకా ట్వీట్ చేసింది.