బతుకమ్మ వేడుకల్లో అపశృతి.. యువకుడి చేయి అమ్మాయికి తగిలిందని.(వీడియో)

by Sridhar Babu |   ( Updated:2023-10-10 11:24:44.0  )
బతుకమ్మ వేడుకల్లో అపశృతి.. యువకుడి చేయి అమ్మాయికి తగిలిందని.(వీడియో)
X

దిశ, మణుగూరు : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గం మణుగూరు మండలంలో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే రేగా కాంతారావు క్యాంపు కార్యాలయంలో మణుగూరు జడ్పీటీసీ పోశం నరసింహా రావు ఆధ్వర్యంలో బతుకమ్మ సంబురాలు ఘనంగా నిర్వహించారు. సోమవారం రాత్రి బతుకమ్మ సంబురాలు ముగించుకున్న తరువాత అందరు బయటకు వస్తున్న తరుణంలో ఒక అమ్మాయి చేయి ఓ అబ్బాయికి అనుకోకుండా తగిలింది.

ఆ సమయంలో సదరు యువకుడు, యువతి మధ్య మాటలు చోటుచేసుకున్నాయి. ఈ క్రమంలో తీవ్ర వేదనకు గురైన సదురు యువతిని ఏమైందని ఆమె.. సోదరులు అడగటంతో జరిగిన విషయాన్ని వివరించింది. దీంతో ఒక్కసారిగా ఆగ్రహానికి గురైన యువతి సోదరులు.. ఆ యువకుడి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో వారు కొట్టుకోవడంతో సదరు యువకుడు.. యువతి సోదరులు గాయపడ్డారు.

అయితే.. ఈ సందర్భంగా నియోజకవర్గ ఎమ్మెల్యే రేగా కాంతారావు లేకుండా క్యాంపు కార్యాలయంలో బతుకమ్మ వేడుకలు ఎందుకు నిర్వహించారని స్థానికులు ప్రశ్నించారు. బతుకమ్మ వేడుకల్లో కొంతమంది యువకులు మద్యం తాగి రావడం వల్లే గొడవలు జరుగుతున్నాయని అన్నారు. కొంతమంది ప్రజాప్రతినిధుల వ్యవహార శైలి వల్లే ఎమ్మెల్యే రేగా పరువు పోతున్నదని ప్రజలు చర్చించుకుంటున్నారు. క్యాంపు కార్యాలయం ముందు ఇంత గొడవ జరిగినా ఏ ఒక్క ప్రజాప్రతినిధి కూడా అడ్డుకోలేదని వాపోయారు.

Advertisement

Next Story