- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కేసీఆర్‌ను ఇరికించిన కేటీఆర్.. రేవంత్ చేతికి చిక్కిన తండ్రి కొడుకుల బాగోతం
దిశ, తెలంగాణ బ్యూరో: అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య సవాళ్లలో మరో కీలక అంశం చేరింది. ఇప్పటి వరకు కేటీఆర్ టార్గెట్‌గా గురి పెట్టిన రేవంత్‌కు.. ఆయనే (కేటీఆర్) మరో అస్త్రాన్ని అందించారు. తాను రాహుల్ గాంధీతో పరీక్షలకు సిద్ధమని చెప్తూనే, రాష్ట్ర కాంగ్రెస్ నేతలను పట్టించుకోను అనే రీతిలో సమాధానమిచ్చేందుకు ప్రయత్నాలు చేశారు. అదే సమయంలో డ్రగ్స్ తీసుకున్నట్లు ఆరోపణలపై తాను, రాహుల్ గాంధీ ఇద్దరం ఢిల్లీ ఎయిమ్స్‌లో పరీక్షలకు సిద్ధమా అంటూ ప్రశ్నించారు. ఇక ఈ నేపథ్యంలోనే రేవంత్ రెడ్డిని ఉద్దేశిస్తూ చర్లపల్లి జైలుకు వెళ్లిన వచ్చిన వారు నా స్థాయి కాదంటూ వ్యాఖ్యానిస్తూ ఓటుకు నోటు కేసును బయటకు తీశారు.
ఇక కేటీఆర్ చేసిన కామెంట్సే కాంగ్రెస్‌కు మరో అస్త్రాన్ని అందించినట్లు అయ్యింది. దీనిపై స్పందించిన రేవంత్‌రెడ్డి.. సీఎం కేసీఆర్‌ను ఇందులోకి లాగారు. తాను రాహుల్‌గాంధీని తీసుకువచ్చేందుకు సిద్ధమే అన్నట్టుగా సోషల్ మీడియాలో రిప్లై ఇచ్చారు. కానీ సీఎం కేసీఆర్ కూడా లై డిటెక్టర్‌కు రావాలని, సహారా కుంభకోణం, ఈఎస్ఐ కుంభకోణాలతో పాటు సీబీఐ కేసుల విషయంలో లై డిటెక్టర్‌కు రావాలంటూ ఆఫర్ ఇచ్చారు. దీంతో కేటీఆర్.. ఈ సవాళ్లలో కేసీఆర్‌ను ఇరికించినట్లుగా పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఈ సవాళ్లు, ప్రతిసవాళ్లు ఇప్పుడు రాష్ట్రంలో ఆసక్తికరంగా మారాయి.
- Tags
- drugs case
- ktr