- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘ఫిఫా’ క్వాలిఫయింగ్ మ్యాచ్‌లు వాయిదా
దిశ, స్పోర్ట్స్: ఫిఫా వరల్డ్ కప్ ఖతర్(FIFA) 2022, ఏఎఫ్‌సీ ఏషియన్ కప్ చైనా(AFC Asian Cup China) 2023 కోసం నిర్వహించాల్సిన ఫుట్‌బాల్ అర్హత మ్యాచ్‌ల(Football qualifying matches)ను వాయిదా వేస్తున్నట్లు ఫిఫా(FIFA) బుధవారం ప్రకటించింది. షెడ్యూల్ ప్రకారం ఈ ఏడాది అక్టోబర్, నవంబర్‌లో ఈ క్వాలిఫయింగ్ మ్యాచ్‌లు జరగాల్సి ఉంది.
అయితే, కరోనా కారణంగా ఆసియా(Asia) పరిధిలో నిర్వహణ అసాధ్యం కావడంతో వీటిని 2021కి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. ఫిఫా(FIFA), ది ఏషియన్ కాన్ఫెడరేషన్ (AFC) సంయుక్తంగా నిర్వహించే ఈ మ్యాచ్‌లను ప్రస్తుతం నిర్వహించడం కష్టమని భావించి, సమగ్ర చర్చల అనంతరం వాయిదా వేశాయి.
‘క్రీడల్లో పాల్గొనే ప్రతి ఒక్కరి ఆరోగ్య రక్షణ మాకు ముఖ్యం, ఆసియా పరిధిలో పరిస్థితిని ఎప్పటికప్పుడు గమనిస్తున్నాం. ఏఎఫ్‌సీ(AFC)తో కలిసి కొత్త షెడ్యూల్(New schedule) విడుదల కోసం పని చేస్తాము. తర్వాతి దశ అర్హత మ్యాచులను వచ్చే ఏడాదికి వాయిదా వేయక తప్పకపోవడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నాము’ అని ఫిఫా(FIFA) ఒక ప్రకటనలో తెలిపింది.