- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నామినేషన్ లాస్ట్ డే.. ఆవేదనతో సీపీ కాళ్లు పట్టుకున్న ఫీల్డ్ అసిస్టెంట్.(వీడియో)
దిశ, హుజురాబాద్ రూరల్ : ఉపాధి హామీలో ఫీల్డ్ అసిస్టెంట్లుగా పని చేసిన తమను తిరిగి ఉద్యోగాల్లోకి తీసుకోవాలని కోరేందుకే తాము ఎన్నికల బరిలో నిలుస్తున్నామని, చిరుద్యోగులమైన తమకు అండగా నిలవాలని వారు.. సీపీ సత్యనారాయణను వేడుకున్నారు. అన్యాయంగా తమను ఉద్యోగాల నుండి తొలగించడంతో తాము రోడ్డున పడ్డామని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల నామినేషన్ చివరి రోజున కూడా ఫీల్డ్ అసిస్టెంట్లు పెద్ద సంఖ్యలో రిటర్నింగ్ ఆఫీసర్ కార్యాలయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా వారు నిరసన వ్యక్తం చేశారు.
సమాచారం అందుకున్న సీపీ సత్యనారాయణ వారితో మాట్లాడారు. నామినేషన్ వేసేందుకు అడ్డుకుంటున్నారని ఓ ఫీల్డ్ అసిస్టెంట్.. సీపీ కాళ్లు మొక్కారు. ఈ సందర్భంగా సీపీ వారితో మాట్లాడుతూ.. తామెవరిని అడ్డకోమని నిబంధనల ప్రకారం నడుచుకోవాలని మాత్రమే చెప్తున్నామన్నారు. నామినేషన్ వేసేందుకు వచ్చిన అభ్యర్థులు తమ వద్ద అన్ని రకాల పత్రాలు ఉన్నట్టయితే నేరుగా రిటర్నింగ్ అధికారి కార్యాలయంలోకి వెల్లిపోవచ్చన్నారు.