- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
నవంబర్ అమ్మకాలకు పండుగ సీజన్ బూస్ట్
దిశ, వెబ్‌డెస్క్: దీపావళి సందర్భంగా బలమైన డిమాండ్, మెరుగైన అమ్మకాల మధ్య బైకులు, కార్ల అమ్మకాలు పెరగడంతో పండుగ సీజన్ ఆటోమొబైల్ పరిశ్రమకు ఉత్సాహాన్నించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల్లో దేశీయ అమ్మకాల గణాంకాలు నవంబర్‌లో బలంగా బౌన్స్ అయ్యే అవకాశముంది. అక్టోబర్ అమ్మకాలతో పోలిస్తే, ధన్‌తేరాస్ సందర్భంగా ప్రజలు ఆటోమొబైల్ లాంటి మూలధన వస్తువులను కొనుగోలు చేస్తారని పరిశ్రమ నమ్ముతోంది.
నిపుణుల అభిప్రాయం ప్రకారం… పండుగ సీజన్ ఆఫర్లు సెమీ అర్బన్, టైర్-2, టైర్-3 నగరాల నుంచి అధిక డిమాండ్, ప్రజా రవాణా కంటే వ్యక్తిగత రవాణాకు ప్రాధాన్యత పెరగడం వల్ల ఆటో అమ్మకాలు పుంజుకుంటాయని చెబుతున్నారు. దేశీయ అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకి ఇండియా నవంబర్ మొదటి రెండు వారాల్లో 37 వేల కార్లను విక్రయించింది. ఇది గతేడాదితో పోలిస్తే చాలా ఎక్కువ అని మారుతీ సుజుకి ఇండియా మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శశాంక్ శ్రీవాస్తవ చెప్పారు. అలాగే, టయోటా కిర్లోస్కర్ ఈ నెలలో ఇప్పటివరకు గతేడాదితో పోలిస్తే 12 శాతం అమ్మకాలు పెరిగాయని పేర్కొంది. ఇతర అంశాలతో పాటు, పండుగ సీజన్ అమ్మకాలు, కొవిడ్-19 నేపథ్యంలో పెరిగిన డిమాండ్ అక్టోబర్, నవంబర్ అమ్మకాలకు దోహదపడ్డాయని వాహన తయారీదారులు స్పష్టం చేస్తున్నారు.