ఇష్టానుసారం ఎరువుల రేట్లు పెంపు.. రైతుల్లో ఆందోళన

by Shyam |
Fertilizer dealers
X

దిశ, కాటారం: ఎరువుల ధరలు రైతులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. గతంలో సీజన్‌కు, లేదా ఏడాదికి ఒకసారి మాత్రమే ధరలు పెరిగేవి. కానీ, ప్రస్తుత పరిస్థితి అందుకు పూర్తి భిన్నంగా ఉంది. ఈ ఏడాది వర్షాలు అధికంగా పడటంతో చెరువులు, కుంటలు, ప్రాజెక్టులు, బావుల కింద వరి పంటను ఎక్కువగా సాగుచేశారు. ప్రస్తుతం వరి పంటకు రెండో డోస్‌గా అమ్మోనియా, యూరియా, పొటాష్ ఎరువులను రైతులు వినియోగిస్తున్నారు. గత పదిరోజులుగా కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో పొటాష్ కొరత తీవ్రంగా ఉంది. దీంతో ధరలు సైతం అధికంగా పెరిగాయి. పొటాష్ MRP ధరపై రూ.100 నుండి రూ.200 వరకు బ్లాక్‌లో ఎక్కువ ధరకు విక్రయిస్తున్నారు.

గత సెప్టెంబర్ నెలతో ఖరీఫ్ సీజన్ ముగిసింది. ఈ నెల నుండి రబీ సీజన్ ప్రారంభం కావడంతో సబ్సిడీ చెల్లింపుల్లో సంధికాలం కావడంతో పొటాష్ సరఫరా‌లో జాప్యం ఏర్పడింది. అంతేగాకుండా.. ఇతర దేశాల నుండి దిగుమతి అవుతుండటంతో ధరల్లో నియంత్రణ లేకుండా పోతోంది. పొటాష్, ఎరువుల కేటాయింపులో కమిషనర్ స్థాయి, లైసెన్స్‌డ్ హోల్‌సేట్ విక్రయాల వ్యాపారస్తులదే హవా కొనసాగుతోందని గ్రామస్థాయి వ్యాపారస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పొటాష్ 50 కిలోల బస్తాకు MRP రూ.1040 ఉంటే హోల్‌సేల్ వ్యాపారస్తులు రూ.1080 వరకు విక్రయిస్తున్నట్లు, లారీ కిరాయి, హమాలీ చార్జీ కలిపి మొత్తం రూ.1150 నుంచి రూ.1200 కు విక్రయిస్తున్నట్లు వ్యాపారస్తులు తెలుపుతున్నారు. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి సరుకు రవాణా చార్జీలు పెరిగాయంటూ ఎరువుల ధరలు పెంచుతున్నారని వాపోయారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభం నుంచి వరుసగా ధరలు పెరుగుతుండటంతో అన్నదాతల్లో ఆందోళన మొదలైంది.

ధరలు ఇలా రూపాయల్లో…

ఎరువు మార్చి అక్టోబర్

20-20 950 1.225
14-35 1,275 1,550
28-28 1,275 1,300
10-26 1,175 1,300

పొటాష్ 875 1,040

Advertisement

Next Story

Most Viewed