ఉపాధి హామీ పనుల్లో అపశృతి.. మహిళా కూలీ మృతి

by Sridhar Babu |   ( Updated:2021-11-02 02:19:37.0  )
female-labour1
X

దిశ, హుస్నాబాద్: ఉపాధి హామీ పనుల్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కూలీలు తెలిపిన వివరాల ప్రకారం.. సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం గుడాటిపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని సోమాజీ తండాకు చెందిన భూక్య లావణ్య(30) మంగళవారం గ్రామ సమీపంలోని ఉపాధి హామీ పనులు చేస్తుండగా మట్టిగడ్డ మీద పడడంతో తీవ్ర గాయాలయ్యాయి. దీంతో స్థానికులు హుటాహుటిన హుస్నాబాద్ ప్రభుత్వాసుపత్రికి తరలించగా లావణ్య మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. మట్టిపెల్ల కూలడంతో పలువురు కూలీలకు కూడా తీవ్ర గాయాలైనట్లు స్థానికులు తెలిపారు. మృతురాలికి భర్త, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Next Story