పరకాలలో పోలీసులకు సన్మానం

by Shyam |   ( Updated:2021-12-26 03:36:20.0  )
Parakala-Police1
X

దిశ, పరకాల: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలకు సంబంధించిన 317 జీవో నిబంధనల మేరకు ఏఎస్ఐ బి. ప్రభాకర్, హెడ్ కానిస్టేబుల్ ఆర్. శివప్రసాద్ లు బదిలీపై కాళేశ్వరం జోన్ కు వెళ్తున్న సందర్భంగా ఆదివారం పరకాల సీఐ పుల్యాల కిషన్ వారిని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సీఐ కిషన్ మాట్లాడుతూ.. పరకాల పోలీస్ స్టేషన్ పరిధిలో వారు అందించిన సేవలను కొనియాడారు. భవిష్యత్ ఉద్యోగ జీవితంలో నిజాయితీగా, నిబద్ధతతో వృత్తి పట్ల అంకితభావం కలిగి ప్రజా మన్ననలు పొందాలన్నారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story