బికినీకి పోటీగా.. పురుషులకు ‘బ్రోకనీ’

by Sujitha Rachapalli |
బికినీకి పోటీగా.. పురుషులకు ‘బ్రోకనీ’
X

దిశ, వెబ్‌డెస్క్ : సముద్ర తీరంలో జలకాలాడాలన్నా, స్విమ్మింగ్‌‌పూల్‌లో చేపలా ఈదులాడాలన్నా మగువలు ‘బికినీ’లకే ఓటేస్తారు. ఇక సెలెబ్రిటీలైతే బికినీ ఫొటోలతో నెట్టింట్లో హల్‌చల్ చేయడం చూస్తూనే ఉంటాం. ఇంకా కొందరు బికినీ ధరించేందుకు వీలుగా తమ ఫిగర్‌ను మార్చుకునేందుకు వర్క్‌వుట్స్ చేస్తారంటే అతిశయోక్తి కాదేమో. మరి ఆడవాళ్లే ‘బికినీ’ల్లో హొయలు పోవాలా? మగాళ్లకు మాత్రం ఏం తక్కువ? అని ఆలోచించారు ఇద్దరు ఫ్యాషన్ డిజైనర్లు. అంతే మగాళ్లకు కూడా వన్ పీస్ స్విమ్ వేర్‌ను మార్కెట్‌లోకి తీసుకొచ్చారు.

మగాళ్లు సాగర తీరానికి వెళ్లినా, స్విమ్మింగ్ ‌పూల్‌లో ఈతకొట్టినా.. సాధారణంగా షార్ట్స్ వేసుకుంటారు. కానీ మహిళలు మాత్రం స్విమ్ సూట్ వేసుకోవడానికి ఇష్టపడుతుంటారు. ఇండియాలో ఇలాంటి సంప్రదాయం లేకపోవచ్చు కానీ.. పాశ్యాత్య దేశాల్లో బికినీలు చాలా కామన్. ఫ్యాషన్ ఇండస్ట్రీలో ఎప్పటికప్పుడు మార్పులు వస్తూనే ఉంటాయి. మహిళలు వేసుకునే బికినీల్లో ఇప్పటికే రకరకాల మార్పులు వచ్చాయి. ఇటీవలే కరోనా ఎఫెక్ట్‌తో ట్రికినీలు కూడా మార్కెట్‌లోకి వచ్చేశాయి. కానీ మగాళ్ల బాతింగ్ సూట్స్‌లో 100 ఏళ్ల నుంచి ఎలాంటి మార్పులు రాలేదు. దాంతో ఈ విషయంపై దృష్టి సారించిన టొరంటోకు చెందిన ఫ్యాషన్ డిజైనర్లు చాద్ సాస్కో, టేలర్ ఫీల్డ్ మగాళ్ల కోసం ప్రత్యేకంగా ‘బికినీ’లను మార్కెట్‌లో ఇంట్రడ్యూస్ చేశారు. వాటికి ‘బ్రోకనీ’ అని పేరు కూడా పెట్టారు. ఆడవాళ్లకు టూ పీస్ ఉంటే.. మగాళ్లకు మాత్రం వన్ పీస్ మాత్రమే. షోల్డర్ బికినీ డ్రెస్సులుగా వీటిని మలిచారు.

బ్రోకనీస్ కొనుక్కోవాలంటే.. బ్రోకనీస్ వెబ్‌సైట్‌లో ఆర్డర్ చేయాల్సి ఉంటుంది. వీటి ధర 40డాలర్లు (రూ. 2,933/-). మరి బికినీలు క్లిక్ అయినట్లుగా బ్రోకనీస్ ఎంతవరకు మగాళ్ల ఆదరణను పొందుతాయో ఇప్పుడే చెప్పలేం. ప్రస్తుతం బ్రోకనీస్ ధరించిన పురుషుల ఫొటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి.

Advertisement

Next Story