- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘చేతబడులపేరుతో భయపెడితే జైలుకు పంపుతాం’
దిశ, నల్లగొండ: చేతబడి, బాణామతుల వంటి మూఢనమ్మకాల పేరుతో ప్రజలను భయాబ్రాంతులకు గురిచేస్తే క్రిమినల్ కేసులు నమోదు చేసి జైలుకు పంపుతామని నల్లగొండ రూరల్ ఎస్ఐ ఏమిరెడ్డి రాజశేఖర్ రెడ్డి హెచ్చరించారు. నల్లగొండ మండలం గుండ్లపల్లి గ్రామానికి చెందిన బొల్లోజు వెంకటాచారి ఇంటి ఎదుట గుర్తుతెలియని వ్యక్తులు పుసుపు కుంకమ కలిపిన బియ్యం, నిమ్మకాయలు, వక్కలు, రవికముక్క, జీడిగింజలు, ఓ జంతువుకు సంబంధించిన ఎముకను పెట్టి వెళ్లారు.
బుధవారం ఉదయం వెంకటాచారి కుటుంబం లేచి చూసేసరికి తమ ఇంటి ఎదుట చేతబడి చేసినట్లు భయాందోళన చెంది రూరల్ పోలీసులకు సమాచారం అందించారు. రూరల్ ఎస్ఐ రాజశేఖర్ రెడ్డి తమ సిబ్బందితో హుటాహుటినా సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. చేతబడుల పేరుతో ఇలా ప్రజలను భయపడితే సహించేది లేదని, మూఢనమ్మకాలను నమ్మవద్దని గ్రామస్థులకు అవగాహన కల్పించారు. కేసు నమోదు చేసి విచారణ నిర్వహించి, నిందితులను పట్టుకుని కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.