- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అందరిలోనూ చివరి అస్త్రం భయం.. స్తంభించిన లావాదేవీలు
దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణలో కరోనా పాజిటివ్కేసుల సంఖ్య జనాన్ని భయపెడుతోంది. రాష్ట్రంలో రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతోంది. ఈ క్రమంలో రాష్ట్రంలో లాక్ డౌన్ పెడతారనే భయం నెలకొంది. కరోనా కేసుల తీవ్రత కూడా లాక్డౌన్ తప్పనిసరి అని సూచిస్తుందన్న చర్చ జోరుగా సాగుతోంది. ఈ క్రమంలో ప్రధాని మోడీ కరోనా కట్టడికి ఆఖరి అస్త్రంగా లాక్డౌన్ పెట్టాలని రాష్ట్రాలకు సూచించిన అంశం బహుళ ప్రాచుర్యంలోకి వచ్చింది. దాని ప్రభావం అనేక రంగాలపై తీవ్రంగా చూపిస్తోంది. ఒకటీ రెండు అంశాలు కాదు.. ప్రైవేటు, వ్యాపార రంగాలన్నీ లాక్డౌన్దిశగా ఆలోచిస్తున్నాయి. చాలా ప్రాంతాల్లో పనులను నిలిపివేశారు. అంతకు ముందు కుదుర్చుకున్న ఒప్పందాలను కూడా రద్దు చేసుకుంటున్నారు. ఆస్తుల క్రయ విక్రయాల్లో అగ్రిమెంట్లను రద్దు చేసుకోవడం, కాల పరిమితిని పొడిగించుకోవడం వంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఏ ఒక్కరూ లావాదేవీలు నడిపేందుకు ముందుకు రావడం లేదు.
ముందుకా.. వెనక్కా?
ఇప్పటికే తలపెట్టిన పనులను కొనసాగించాలా? వాయిదా వేయాలా? రద్దు చేసుకోవాలా? తెలియక చాలా మంది తికమకపడుతున్నారు. ప్రధానంగా పెళ్లిళ్లు, ఇండ్లు, ఫ్లాట్ల కొనుగోళ్లపై ఏ నిర్ణయం తీసుకోలేకపోతున్నారు. ముందుకు వెళ్తే కరోనా వ్యాప్తి తీవ్రతకు బలి కావాల్సి వస్తుందన్న భయం నెలకొంది. పైగా అందుతాయనుకున్న డబ్బులు నిలిచిపోతున్నాయి. ఎవరిని డబ్బుల కోసం అడిగినా అంతటా.. కరోనా వైరస్ పెట్టుకొని డబ్బులు ఎలా ఇస్తారనుకుంటున్నారన్న అనే సమాధానమే వస్తుందని పెళ్లిళ్ల నిర్వాహకులు అంటున్నారు. ఏ ఫంక్షన్‌హాల్‌కి వెళ్లినా ముందుగా అనుకున్నట్లుగా కాకుండా అతి తక్కువ మందితోనే పెళ్లి చేస్తామని, అనుకున్న ప్రకారం రెంట్ఇవ్వలేమంటూ బతిలాడుతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి.
మళ్లీ మందగించిన రియల్ ఎస్టేట్ రంగం
ఇండ్లు, ఫ్లాట్లు కొనేందుకు కూడా అవసరమైన మొత్తాన్ని సర్దుబాటు చేసుకున్న తర్వాత ఎంపిక చేసుకున్నారు. కానీ ఇప్పుడేమో లావాదేవీలు నిలిచిపోవడంతో అనుకున్న పనులను రద్దు చేసుకుంటున్నారు. ఒకటీ రెండు ఉదాహరణలు కాదు.. రద్దు చేసుకున్న క్రయ విక్రయాల ఒప్పందాలు నగర శివార్లలో వేలాదిగా దర్శనమిస్తున్నాయి. గడిచిన వారం రోజులుగా ఏ రియల్ఎస్టేట్ఆఫీసుకు వెళ్లినా ఇలాంటి రద్దు, కాల పరిమితి పొడిగింపు వంటి అంశాలపైనే చర్చలు వినిపిస్తున్నాయి. ప్రధానంగా నగర శివార్లలో బడంగ్‌పేట, మీర్‌పేట, బండ్లగూడ కార్పొరేషన్లు, తుర్కయంజాల్, ఆదిబట్ల, పెద్ద అంబర్‌పేట, మేడ్చల్, శామీర్‌పేట, తూంకుంట, ఘట్ కేసర్తదితర మున్సిపాలిటీల్లో లావాదేవీలు పూర్తిగా నిలిచిపోయినట్లు తెలుస్తోంది.
అన్నీ నిలిపివేత
ఎల్బీనగర్సమీపంలోని ఓ పెట్రోల్ బంక్. లారీలు, డీసీఎంలు, పొక్లెయిన్ వాహనాలకు డీజిల్పోయడం.. వారికి బిల్లులు వచ్చినప్పుడు డబ్బులు తీసుకోవడం పరిపాటి. ఇప్పుడేమో లాక్డౌన్ఎప్పుడు పెడతారో తెలియని అయోమయం. డీజిల్బిల్లు ఇవ్వమని అడిగితే పనులు నిలిచిపోయాయని, ఇప్పట్లో చెల్లించలేమంటూ వాహనాల యజమానులు తెగేసి చెబుతున్నారు. ఐతే డీజిల్కంపెనీ యాజమాన్యం మాత్రం చెల్లించాల్సిందేనంటూ నోటీసులు జారీ చేసింది. చెల్లించేందుకు అప్పు కూడా పుట్టకపోవడంతో పెట్రోల్ పంప్యజమాని లబోదిబోమంటున్నారు. లాక్డౌన్ఉంటుందో, ఉండదో తెలియదు. కానీ జనం మాత్రం గందరగోళానికి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
అడ్వాన్స్‌లు ఇచ్చి ఇరకాటం
వచ్చే గురువారం పెళ్లి. బీఎన్‌రెడ్డినగర్‌లోని ఓ ఫంక్షన్ హాల్‌ను మాట్లాడుకున్నారు. ఇరుపక్షాలు పెళ్లికి 1000 మందిని పిలవాలని అనుకున్నారు. ఇంతలోనే కరోనా వ్యాప్తి జోరందుకున్నది. ఇప్పుడేమో 100 మందితోనే పూర్తి చేయాలనుకుంటున్నారు. కానీ ఫంక్షన్హాల్మాత్రం పెద్దది. ఆ స్థాయిలోనే కిరాయి. ఇప్పుడేమో పదో వంతుతోనే పెళ్లి. మరి మొత్తం డబ్బులు చెల్లించాలా? అని ఆందోళన. వంటవాళ్లను, భాజాబజెంత్రీలు, డెకరేషన్… అన్నీ మొదట అనుకున్న స్థాయికి తగ్గట్టుగానే అడ్వాన్సులు ఇచ్చారు. ఇప్పుడేం చేయాలో తెలియక తికమకపడుతున్నారు.
నిలిచిన ఇంటి కొనుగోలు
నల్లగొండ జిల్లాకు చెందిన ఓ వ్యాపారి అల్మాస్‌గూడలో ఓ ఇంటిని కొనేందుకు రేటు మాట్లాడుకున్నారు. టోకెన్అమౌంట్ ఇచ్చారు. వారంలో అగ్రిమెంటు కుదుర్చుకుంటామని చెప్పారు. కానీ ఇప్పుడు కరోనా కేసుల సంఖ్య పెరగడంతో అన్ని లావాదేవీలు నిలచిపోయాయి. దాంతో అగ్రిమెంటు కుదుర్చుకోవడానికి అవసరమైన 25 శాతం అమౌంట్రాలేదు. పైగా ఎప్పుడు వస్తాయో కూడా తెలియని అయోమయ పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో టోకెన్అమౌంట్తోనే ఇంటి కొనుగోలును నిలిపివేశారు.