డైమండ్ క్రియేటర్‌గా బార్సిలోనా ఎఫ్‌సీ

by Shyam |
డైమండ్ క్రియేటర్‌గా బార్సిలోనా ఎఫ్‌సీ
X

దిశ, స్పోర్ట్స్ : స్పానిష్ ఫుట్‌బాల్ లీగ్ ‘లా లిగా’ (LaLiga) క్లబ్ అయిన బార్సిలోనా ఎఫ్‌సీ సరికొత్త మైలురాయిని అందుకున్నది. యూట్యూబ్‌లో 10 మిలియన్ సబ్‌స్క్రైబర్లు (Subscribers) కల్గిన మొట్టమొదటి ఫుట్‌బాల్ క్లబ్‌గా రికార్డు సృష్టించింది. ఒక ఫుట్‌బాల్ క్లబ్ యూట్యూబ్ అకౌంట్ తెరవడం కూడా బార్సిలోనా తోనే మొదలయ్యింది.

2006 ఫిబ్రవరిలో మొదటి సారి బార్సిలోనా ఎఫ్‌సీ (FC Barcelona) తమ యూట్యూబ్ ఛానల్ ప్రారంభించింది. ఇప్పటి వరకు క్లబ్ అప్‌లోడ్ చేసిన వీడియోలను 65 మిలియన్ గంటల పాటు వీక్షించినట్లు తెలిపింది. బార్సిలోనా రికార్డు సృష్టించడంతో యూట్యూబ్ ఈ స్పానిష్ క్లబ్‌కు డైమండ్ క్రియేటర్ అవార్డును ఇచ్చింది.

క్రీడారంగానికి సంబంధించి బార్సిలోనా కంటే ముందు నేషనల్ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ (NBA) మాత్రమే ఉంది. ఎన్‌బీఏకు యూట్యూబ్‌లో 14.7 మిలియన్ సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. బార్సిలోనా జట్టు ఈ ఏడాది ఛాంపియన్స్ ట్రోఫీలో ఘోర పరాజయం పాలయ్యింది. దీంతో ఆ జట్టును వీడాలని కెప్టెన్ లియోనల్ మెస్సీ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుత సీజన్‌లో మాత్రం జట్టుతోనే కొనసాగుతున్నాడు.

Advertisement

Next Story

Most Viewed