Social Media : రేపటి నుంచి ఎఫ్‌బీ, ట్విట్టర్ బ్లాక్?

by Shamantha N |   ( Updated:2021-05-24 23:05:42.0  )
Social Media : రేపటి నుంచి ఎఫ్‌బీ, ట్విట్టర్ బ్లాక్?
X

న్యూఢిల్లీ: మనదేశంలో రేపటి నుంచి ఫేస్‌బుక్(Facebook), ట్విట్టర్ (Twitter), ఇన్‌స్టాగ్రామ్‌లు (Instagram) బ్లాక్ కాబోతున్నాయా? భారతీయులు వీటిని బ్రౌజ్ చేయలేరా? అంటే కొన్ని ప్రభుత్వవర్గాలు కొత్త రూల్స్‌ను పేర్కొంటూ ఔననే అంటున్నాయి. డిజిటల్ కంటెంట్‌పై కోడ్ ఆఫ్ ఎథిక్స్, మూడంచెల ఫిర్యాదుల పరిష్కారానికి ఫ్రేమ్‌వర్క్ నిబంధనలు, కొత్త రూల్స్ రేపటి నుంచి అమల్లోకి రానున్నాయి. ఫిబ్రవరిలోనే వీటితోపాటు న్యూస్ సైట్స్, ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లకోసం రూల్స్‌ను విడుదల చేసింది. వాటిని అమలు చేసుకోవడానికి మూడు నెలల గడువు ఇచ్చింది. ఈ గడువు ఈ నెల 25తో ముగియనుంది. ఇప్పటి వరకు వీటిని ఒకే ఒక కంపెనీ(మైక్రోబ్లాగింగ్ సైట్ ‘కూ’?) పాటించింది. మిగతావన్నీ వీటినింకా అమలు చేయనేలేదు. దీంతో ఈ సంస్థలు ఈ నెల 26 నుంచి మనదేశంలో బ్లాక్ కానున్నాయని కొన్నివర్గాలు వెల్లడించాయి. ఈ గడువులోగా సంస్థలు కొత్త రూల్స్‌ను అమలు చేయడంలో విఫలైమతే వాటిపై క్రిమినల్ యాక్షన్ తీసుకోవచ్చని వివరించాయి. ఈ యాక్షన్స్‌ను వారు సవాల్ చేసినప్పటికీ నిబంధనల పాలన మాత్రం తప్పదని పేర్కొ్న్నాయి.

ప్రతి సంస్థ ఫిర్యాదుల పరిష్కారానికి భారత్‌కు చెందిన ఉద్యోగిని నియమించాలని, అతని పేరు, ఇండియాలోని ఆయన చిరునామా వివరాలను కేంద్రానికి ఇవ్వాల్సి ఉంటుందని కొత్త రూల్స్ పట్టిక పేర్కొంది. ఆయా సంస్థల ఓవర్‌సైట్ మెకానిజం‌లో ఓ కమిటీ ఉండాలని, అందులో రక్షణ, విదేశాంగ, హోం, ఐ అండ్ బీ, లా, ఐటీ, మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖల నుంచి ప్రతినిధులుండాలి. నిబంధనలు ఉల్లంఘించినట్టు వచ్చే ఫిర్యాదుల పరిష్కారానికి స్వయంగా విచారణను చేపట్టే అధికారం వీరికుంటుంది. కంటెంట్‌ను నేరుగా బ్లాక్ చేయడానికి జాయింట్ సెక్రెటరీ, లేదా అంతకు పై హోదా గల అధికారిని ప్రభుత్వం నియమిస్తుంది.

Advertisement

Next Story